28.7 C
Hyderabad
May 6, 2024 00: 08 AM
Slider ముఖ్యంశాలు

కృత్రిమ మేధస్సు, సైబర్ ఫీజికల్  సిస్టమ్స్ దే భవిష్యత్తు

#robotics

రోబోటిక్స్ మరియు సైబర్ ఫిజికల్ మెషీన్‌లపై చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో నేడు ఆన్‌లైన్ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. యెన్ఏఎస్ఐ  సీనియర్ సైంటిస్ట్- కాన్షియస్‌నెస్ స్టడీస్ ప్రోగ్రామ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్- ఐఐఎస్సీ  క్యాంపస్  ప్రొఫెసర్ ఎల్ ఎమ్ .పట్నాయక్  ముఖ్య అతిథిగా విచ్చేశారు.

చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మరియు గ్లోబల్ హెడ్ – టెక్నాలజీ అడ్వైజరీ సర్వీసెస్, అడ్వైజరీ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ గ్రూప్ –  సిఎమ్టి  యూనిట్, టిసిఎస్ బాల ప్రసాద్ పెద్దిగారి ప్రారంభ సెషన్సె కు  గౌరవ అతిథిగా  హాజరయ్యారు. ప్రొఫెసర్  ఎల్ ఎమ్ .పట్నాయక్ కృత్రిమ మేధస్సు మరియు సైబర్ భౌతిక వ్యవస్థల పాత్ర గురించి చెప్పారు. సమర్జీత్ బోరా, ఎస్ఎమ్ ఐటి – సిక్కిం, లలిత్ గార్గ్- మాల్టా విశ్వవిద్యాలయం జనరల్ చైర్‌గా ప్రసంగించనట్టు  ఐటి విభాగం అధిపతి ప్రొఫెసర్ రజనీకాంత్ అలువాలు తెలిపారు.

సైబర్‌ సెక్యూరిటీ కోసం ఏఐ లో సాధారణ సమస్యలు, సవాళ్లు అనే శీర్షికలపై ఇతర సెషన్‌లు, సైబర్ ఫిజికల్ సిస్టమ్‌ల పునాది శాస్త్రీయ సిద్ధాంతాలు, ఇంజినీరింగ్ విభాగాలను ఎనేబుల్ చేయడం, ఏఐ, రోబోటిక్‌లు ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను ఎలా మారుస్తున్నాయి, సైబర్ ఫిజికల్ సిస్టమ్‌లను అమలు చేసే పద్ధతులు, పరిశ్రమ కోసం అభిజ్ఞా విశ్లేషణలు 4.0 మరియు ప్రారంభించడం క్లౌడ్ రోబోటిక్స్ ద్వారా రోబోటిక్స్-ఏ-సర్వీస్ ఫ్రేమ్‌వర్క్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలకు చెందిన నిపుణులు పరిశోధనా పత్రాలు  సమర్పించనట్టు  ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు.

Related posts

అభివృద్ధి కమిటీలకు జెడ్పీటీసీ లు ఇక శాశ్వత సభ్యులు

Satyam NEWS

(Sale) Cbd Oil Premium Hemp Extract Indusrial Hemp Strains For Cbd Oil

Bhavani

పదోతరగతి పరీక్షాపత్రాల మూల్యాంకనం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment