26.7 C
Hyderabad
May 3, 2024 07: 58 AM
Slider మహబూబ్ నగర్

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

#YasminBhashaIAS

మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఎం.ఎల్.సి. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.

బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో జిల్లా సాధారణ పరిశీలకులు హరిప్రీత్ సింగ్, ఐ.ఏ.ఎస్. సమక్షంలో గూగుల్ మీట్ ద్వారా పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు ఓటర్లకు సహకరించాలని, పోలింగ్ సిబ్బందికి నియమించబడిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు.

జిల్లా సాధారణ పరిశీలకులు హరిప్రీత్ సింగ్, ఐ.ఏ.ఎస్. మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఎన్నికల విధులకు నియమించబడిన సిబ్బంది ఒక టీమ్ లో (4) నలుగురు చొప్పున (38) టీమ్ లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి, హాజరయ్యారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

కవిత సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన నిజామాబాద్ బీజేపీ కార్పొరేటర్లు

Satyam NEWS

ములాయం సింగ్ యాదవ్ జీవితం అత్యంత స్ఫూర్తిదాయకం

Satyam NEWS

ఉద్యమానికి సిద్ధపడుతున్న ఉపాధ్యాయ సంఘం

Satyam NEWS

Leave a Comment