28.7 C
Hyderabad
April 28, 2024 08: 49 AM
Slider చిత్తూరు

యథేచ్ఛగా సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్

#SudhakarNB24

ఉపముఖ్యమంత్రి కె నారాయణ స్వామి ప్రాతినిధ్యంలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పోలీసు రాజ్యం కొనసాగుతోందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు

ఈ ప్రాంతానికి చెందిన కొందరు ఎర్రచందనం స్మగ్లర్లు, ఇసుక దొంగలు, భూబకాసురుల పోలీసుల అండతో అడ్డువచ్చిన వారిని అణచి వేస్తున్నారని తెలిపారు

ప్రభుత్వ, వైకాపా నేతల అక్రమాలను వెలుగులోకి తెస్తున్న పెనుమూరు మండల ఐటీడీపీ ఇంచార్జి ఎం. సతీష్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు.

గతంలో యనమల మంద  దళితులపై తప్పుడు కేసులు పెట్టి కోర్టులచుట్టూ తిప్పుతున్నారని గుర్తు చేసారు.

పంచాయతీ ఎన్నికల సమయంలో పలుచోట్ల పోలీసులు వైకాపా నేతల దౌర్జన్యాలకు అండగా నిలిచారన్నారు. మాంబేడులో పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ చేయించారని,బొట్లవారి పల్లెలో దౌర్జన్యం చేసినవారిపై కంటితుడువు చర్యలు తీసుకుని వదిలేసారని విమర్చించారు.

నియోజకవర్గంలోని పలు మార్గాలలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందని మొత్తుకుంటుంటే పట్టించుకునే నాధుడే లేడని వాపోయారు.ఇటీవల బ్రాహ్మణ పల్లె వద్ద ప్రమాదానికి గురైన కారులో ఎర్రచంనం దుంగలు బయట పడ్డాయనితెలిపారు.

ఆ దుంగలకు  నెంబర్లు వేసి  ఉన్నందున వాటిని ప్రభుత్వ గోడౌన్ నుంచే తరలించినట్టు అర్ధమవుతున్నదని చెప్పారు.ప్రతి నిత్యం లారీల కొద్దీ ఇసుక తరలి పోతున్నా పట్టించుకునే వారే లేరన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్ కు నెలనెలా  మాముళ్లు చేరుతున్నాయని ఆరోపించారు.

పోలీసులు టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం మానుకోకుంటే ఎస్ ఐలపై  కేసులు పెట్టడానికి వెనుకాడబోమని తేల్చి చెప్పారు.

Related posts

డా.మోహన్ కు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం

Bhavani

ఎన్‌టి‌ఆర్ విగ్రహ ఏర్పాటుపై హైకోర్ట్ స్టే

Bhavani

బి ఆర్ ఎస్ కు జై కొట్టిన లబానా లంబాడీలు

Satyam NEWS

Leave a Comment