40.2 C
Hyderabad
May 6, 2024 15: 56 PM
Slider మహబూబ్ నగర్

గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

#yasminbasha

గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని అభ్యర్థులు సందేహాలను 08545-233525 నంబర్ కు తెలిపి నివృత్తి చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా కోరారు. జిల్లాలో 4,343 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అవుతారని,జిల్లాలో 16 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశామని కలెక్టర్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ నెల 16వ తేదిన నిర్వహించనున్న గ్రూప్ – 1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఐ డి ఓ సి ప్రజావాణి సమావేశ  మందిరంలో జిల్లా కలెక్టర్ గ్రూప్ -1 పరీక్షల నిర్వహణపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ మొదటి సారిగా రాష్ట్రంలో గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తున్నందున జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. జిల్లాలో 4,343 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని, జిల్లాలో (16) పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాలకు వాచ్, షూ, పర్స్, క్యాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించబోమని ఆమె తెలిపారు.

గ్రూపు-1 పరీక్ష ఉదయం గం. 10.30 ని.లకు ప్రారంభమవుతుందని, పరీక్షలు రాసే అభ్యర్థులు బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నులు తీసుకొచ్చుకోవాలని, ఉదయం గం.10.15 ని.లకు పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న గేట్లు మూసివేస్తారని, బయోమెట్రిక్ విధానం ద్వారా అటెండెన్స్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు కచ్చితంగా ఉదయం గం.8.30 నిమిషాలు ముందు అభ్యర్థులు పరీక్షా సెంటర్ కు హాజరుకావాలని ఆమె సూచించారు. పరీక్ష కేంద్రాల ప్రాంగణాలలో సెల్ ఫోన్ అనుమతించబోమని జిల్లా కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత ఫోటొ సరిగా రాని పక్షంలో 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు గెజిటెడ్ అధికారి ధృవీకరణతో పరీక్ష కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

తనిఖీ కోసం పోలీసుల నియామకం

పరీక్ష సెంటర్ల వద్ద సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్స్ ను ఏర్పాటు చేసినట్లు, తనిఖీ కోసం మహిళ పోలీసులు, పురుష పోలీసులను బందోబస్తుకై  ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 16వ తేదిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నిర్వహించు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ లోని 08545-244525  ఫోన్ నంబర్ కు కార్యాలయ పనివేళల్లో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని ఆమె సూచించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు 3,110 మంది అభ్యర్థులు హాల్ టికెట్ లను డౌన్ లోడ్ చేసుకున్నట్లు ఆమె చెప్పారు. హాల్ టికెట్ తో పాటు ఫోటో, ఐడీ కార్డులను వెంట తీసుక రావాలని ఆమె సూచించారు. పరీక్ష కేంద్రాల పరిధిలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆమె తెలిపారు. మీడియా వాళ్లకు పరీక్ష హాల్లో అనుమతి లేదని ఆమె సూచించారు. సీసీ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్, సెట్టింగ్స్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

కొత్త పీఎస్ భవనాన్ని పరిశీలించిన విజయనగరం ఎస్పీ దీపిక

Satyam NEWS

తీరం దాటిన నివ‌ర్‌.. పెను బీభ‌త్సం

Sub Editor

నాజా జిల్లా అధ్యక్షుడు మందడి చిరంజీవిని సన్మానించిన పెబ్బేరు విలేఖరులు

Satyam NEWS

Leave a Comment