31.2 C
Hyderabad
May 3, 2024 00: 46 AM
Slider జాతీయం

ఉక్రెయిన్ లో చిక్కుకున్న ప్రతి భారత పౌరుడిని తీసుకువస్తాం

#kishanreddy

ఉక్రెయిన్ లో చిక్కుకున్న ప్రతి భారత పౌరుడిని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంబర్ పేట్ లోని పటేల్ నగర్ లో అసంఘటిత రంగ కార్మికులకు మేలు చేసే విధంగా బీమా ప్రయోజనాలను చేకూర్చే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ శ్రమ్ కార్డులను  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉక్రెయిన్ లో చిక్కుకున్న ప్రతి భారత పౌరుడిని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఇప్పటికే   కొద్ది మంది విద్యార్థులను దేశానికి తీసుకురాగలిగామని పేర్కొన్నారు. మిగతా భారత పౌరులను  కూడా తీసుకురావడానికి సరిహద్దు దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు చేపట్టడం జరిగిందని అన్నారు.

స్వయంగా ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రి వర్గ సభ్యులు అనునిత్యం పౌరులతో మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పి తీసుకురావడానికి అన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

చైనా సరిహద్దు లో సూర్యాపేటకు చెందిన కల్నల్ మృతి

Satyam NEWS

విదేశాల నుంచి వచ్చే వారికి ప్రభుత్వ మార్గదర్శకాలు

Satyam NEWS

ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయింతి

Satyam NEWS

Leave a Comment