28.7 C
Hyderabad
May 5, 2024 23: 22 PM
Slider ప్రత్యేకం

కాపు కులస్తులకు క్షమాపణ చెప్పిన అంబటి రాంబాబు

#ambati rambabu

కాపుకులస్తుల్ని దారుణంగా తిట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు బేషరతుగా కాపు కులస్తులకు క్షమాపణ చెప్పారు.

తన మాటలు కాపు కులస్తులను ఎంతగానో బాధించాయని, తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ఆయన అన్నారు. కాపు కులస్తుల మనసులను గాయపరిచినందుకు క్షమాపణ చెబుతున్నట్లుగా అంబటి రాంబాబు తెలిపారు. ఈ మేరకు చేతులు జోడించి క్షమాపణ చెబుతున్న వీడియోను ఆయన విడుదల చేశారు.

కాపు కులస్తులను అంబటి రాంబాబు తిట్టడంపై ఈ నెల 18న సత్యంన్యూస్.నెట్ పోస్టు చేసిన ప్రత్యేక కథనం పాఠకుల సౌకర్యం కోసం మళ్లీ ఈ కింద ఇస్తున్నాం:

కులాల కుమ్ములాటలో ముందుండే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు తమ సొంత కులం వారినే దారుణంగా తిడుతున్నారు. అధికారంలో ఉన్న కులం వారికి చేరువ కావాలంటే ఇంత కన్నా మార్గం లేదని అనుకుంటున్నారేమో తెలియదు కానీ ఆ పని చేసిన వ్యక్తి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీలో కీలక వ్యక్తి అయిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

కాపు కులస్తుడైన అంబటి రాంబాబు ఒక సోషల్ మీడియా ఛానెల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కాపు కులస్తులపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కాపు కులస్తులు తెలివితక్కువ వారు, ఆవేశపరులు, మాసాన్ని ఎక్కువ తింటారు, తాగుబోతులు అని ఆయన అన్నారు. ఇవే మాటలు ఆయన గతంలో ఒక సందర్భంలో అన్నారట.

ఈ విషయాన్ని ఛానెల్ యాంకర్ గుర్తు చేయగా ఇప్పటికీ తాను ఆ విషయాలకు కట్టుబడి ఉంటానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కాపు కులస్తులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సర్వే ఏదైనా చేశారా అని యాంకర్ అడగగా సర్వేచేయాల్సిన అవసరం లేదని కాపు కులస్తులు అందరూ అలానే ఉంటారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

కాపు కులస్తులలో అనైక్యత ఎక్కువగా ఉంటుందని, కలిసి పని చేద్దాం అని ఒక చోటికి వచ్చినా కూడా కలిసి ఉండలేరని ఆయన స్పష్టం చేశారు. అందుకే కాపు కులస్తులు జనాభాలో ఎక్కువగా ఉన్నా ముఖ్యమంత్రి స్థాయికి రాలేకపోయారని ఆయన అన్నారు. కాపు కులస్తులపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

కాపు సంఘాలు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రత్నాలును రాశులుగా పోసి అమ్మిన శ్రీ కృష్ణ దేవరాయలు, బ్రిటిష్ వారి గుండెల్లో అల్లూరి కంటే ముందే నిద్రపోయిన పల్నాటి సింహం శ్రీ కన్నెగంటి హనుమంతు, బ్రిటిష్ వారి దెబ్బలకు లెక్క చేయక జెండా పాతిన తోట నరసయ్య నాయుడు, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి గవర్నర్ గా చేసిన సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు, తెలుగు వచన భాషకి మెరుగులు దిద్దిన తాపీ ధర్మారావు నాయుడు, బ్రహ్మర్షి బిరుదాంకితుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు, తెలుగు సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు, వయోలిన్ మీద సప్త స్వరాలను పలికించిన ద్వారం వెంకటస్వామి నాయుడు, విదేశీయులను సైతం తన నటనతో ఆకట్టుకున్న యస్.వి.రంగారావు, గోధుమ వంగడాల మీద పరిశోధనలు చేసి మిస్టర్ వీట్ గా పేరుగాంచిన ఆహార శాస్త్రవేత్త యం.వి.రావు  ఇలా ఎందరో మరెందరో గొప్ప గొప్ప మహానుభావులు, మేధావులు  పుట్టిన జాతి కాపు జాతి అని కాపు నాయకులు అంటున్నారు.

‘‘ దరిద్రం ఏమిటంటే నీలాంటి వెధవలు కూడా అక్కడక్కడ పుట్టారు’’ అంటూ కాపుల వాట్స్ యాప్ గ్రూపుల్లో తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాయలసీమ బలిజనాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెపూల మధురాయలు ‘‘అంబటి రాంబాబు నువ్వు నిఖార్సు అయిన కాపువేనా’’ అని ప్రశ్నించారు.

గత 30 సంవత్సరాలుగా కాపు కులాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయంగా ఎదిగి ఇప్పుడు నీకున్న దరిద్రపు అలవాట్లను యావత్తు జాతికి అంటగడుతున్నావు అంటూ ఆయన విరుచుకుపడ్డారు. కాపు జాతిలో ఎందరో మహనీయులు పుట్టారని, ముందు కాపు జాతి ఔన్నత్యాన్ని అంబటి రాంబాబు తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. ఇంకొక్క సారి కాపు జాతి గురించి తప్పుడు కూతలు కూస్తే తాట తీస్తాం అని ఆయన హెచ్చరించారు.

Related posts

పి వి ‘‘కాలాతీతుడు’’ కవులకు 8న రవీంద్ర భారతిలో సత్కారం

Satyam NEWS

కేసీఆర్ అధికారంలో ఉంటే ఇళ్లురావు, ఉద్యోగాలు రావు

Satyam NEWS

జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందే

Bhavani

Leave a Comment