40.2 C
Hyderabad
May 5, 2024 18: 43 PM
Slider కడప

నందలూరు రైల్వే స్టేషన్ ను ఆదుకోండి ఎంపీ గారూ….

#MP Mithunreddy

బ్రిటిష్ హయాంలో దక్షిణ మధ్య రైల్వే లో ఓ వెలుగు వెలిగిన నందలూరు రైల్వే స్టేషన్ నేడు నిరాదరణ గురై అన్నీ మౌలిక వసతులు ఉన్నా విభాగాలు తరలి పోతున్నాయి.

ఇదే విషయాన్ని ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి నందలూరు వైసీపీ నేతలు ఆయనకు వినతి పత్రాన్ని అందించారు.

కడప జిల్లా నందలూరు రైల్వే సమస్యలపై ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ఆదివారం రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో నందలూరు వైసీపీ నేతలు భేటీ అయ్యారు.

నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ వైకాపా నాయకులు నందలూరు రైల్వే సమస్యలపై ఎంపీ కి వినతి పత్రం అందజేశారు.

రైల్వే క్రూ తరలింపు, రైళ్ల నిలుపుదల, రైల్వే కేంద్రంలోని మౌలిక వసతులను ఎంపీ కి వివరించారు. దీంతో స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి రైల్వే జిఎం తో ఫోన్ ద్వారా మాట్లాడారు.

తరలింపు చేయడం తగదని పేర్కొన్నారు. గతంలో లాగా అన్ని రైళ్లు ఆపాలని కోరారు. జిఎం కూడా సానుకూలంగా స్పందించినారు.

జులై నెలలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో నందలూరు రైల్వే సమస్యలపై చర్చించడం జరుగుతుందని ఎంపీ హామీ ఇచ్చారు.

నందలూరు రైల్వే పరంగా అన్ని విధాలుగా నష్టపోతుందని ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి రైల్వే బోర్డు చైర్మన్ తో కూడా మాట్లాడాలని ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి ఎంపి కి తెలిపారు.

అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకొని నందలురు రైల్వే కి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంబు సూర్యనారాయణ వైకాపా నాయకులు రమేష్ రెడ్డి, అరిగే మని సోమిసెట్టి ప్రభాకర్, పెను బాల నాగ సుబ్బయ్య, మందేం నాగరాజు, పనతల రామ చంద్రయ్య, నాని అక్కి వెంకటరమణ మట్టి బాబు, కాకి చంద్ర శంకర తదితరులు పాల్గొన్నారు.

Related posts

టీఆర్ఎస్ అంటే మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం

Satyam NEWS

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

బండి, అక్బ‌ర్‌ల‌పై కేసులు న‌మోదు

Sub Editor

Leave a Comment