26.7 C
Hyderabad
May 3, 2024 09: 52 AM
Slider రంగారెడ్డి

జ్ఞానానికి ప్రతీక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్

#cbit

సీబీఐటీలోని ఎస్సీ/ఎస్టీ సెల్ ఆధ్వర్యం లో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనం గా  నిర్వహించారు. యూజీసీ డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ మెరుగు  గోపీచంద్, ఉస్మానియా/తెలంగాణ యూనివర్సిటీ లా ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ జి వినోద్ కుమార్ అంబేద్కర్ గురించి చెప్పారు. డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ చేసిన పిహెచ్ డి  థీసిస్‌   “రూపాయి సమస్య” గురించి వివరించారు. 

డా.బి.ఆర్. అంబేద్కర్ రాసిన 257 పేజీల సుదీర్ఘ పత్రం రూపాయి సమస్య. దీనిని  మార్చి 1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో తన డాక్టోరల్ థీసిస్‌గా సమర్పించారు. డాక్టర్ అంబేద్కర్ స్వతంత్ర భారతదేశం మొదటి న్యాయ మంత్రి. భారత రాజ్యాంగం ప్రధాన రూపశిల్పి. అంబేద్కర్ నిష్ణాతుడైన విద్యార్థి. కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి న్యాయ పట్టా, వివిధ డాక్టరేట్లను సంపాదించారు. న్యాయశాస్త్రం, ఆర్థిక శాస్త్రం మరియు రాజకీయ శాస్త్రంలో తన పరిశోధనలకు పండితుడిగా ఖ్యాతిని పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి  రవీందర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ప్రవచనం ద్వారా మనం  సామాజిక స్వేచ్ఛను సాధించనంత కాలం, చట్టం ద్వారా ఏ స్వేచ్ఛను అందించినా మనకు  ప్రయోజనం ఉండదని చెప్పడం తనకు ఎంతో నచ్చింది అని తెలిపారు.

సీబీఐటీ ఎస్సీ/ఎస్టీ సెల్ కన్వీనర్  ప్రొఫెసర్ డి రామణ్ మాట్లాడుతూ ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు తదుపరి చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తోంది. విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకోవాలి అని కోరారు. ఈ సందర్భంగా గ్లోబల్ కన్సల్టెన్సీ  ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు ఐఈఎల్ టిఎస్ పుస్తకాలను ఉచితం గా  పంపిణీ చేసింది.  ఈ కార్యక్రమంలో డాక్టర్లు సుమిత్ర, మోహన్‌, డాక్టర్‌ జిఎన్‌ఆర్‌ ప్రసాద్‌, డాక్టర్ ప్రసాద్ బాబు, హర్ష , రాజు ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

కుల సంఘాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడింది

Satyam NEWS

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ

Satyam NEWS

సృజనాత్మకతోనే సరికొత్త ఆవిష్కరణలు సాధ్యం

Satyam NEWS

Leave a Comment