40.2 C
Hyderabad
April 29, 2024 15: 39 PM
Slider ఆదిలాబాద్

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ

#nirmal

ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్య గార్డెన్ లో  నిర్మల్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభను నిర్వ‌హించారు. సభా ప్రాంగణంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను పార్టీ శ్రేణుల‌తో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్క‌రించారు. అనంత‌రం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ అమరవీరులకు నివాళిగా 2 నిమిషాలు మౌనం పాటించారు.

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రిగింది. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్వాగతం ఉపన్యాసం చేశారు. ఇందులో పార్టీ ప్రాధాన్యతా అంశాలపై ముఖ్య నాయకులు చర్చించారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో సాధించిన ప్రగతిని వివ‌రించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ మోకాలడ్డుతున్న తీరును ఎండ‌గ‌ట్టారు.  బీఆర్‌ఎస్‌ పార్టీ సాధించిన ప్రగతితో పాటు బీజేపీ వైఫల్యాల‌పై  తీర్మానాలను ప్రవేశపెట్టి,  కరతాళధ్వనులతో వాటిని ఆమోదించారు.

స‌మావేశంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రిస్తూ.. వాటిని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌పై ఉంద‌న్నారు.  రానున్న ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టినుంచే స‌న్న‌ద్ధం కావాల‌ని శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ ప‌ట్ల  క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్న  బీజేపీ  కేంద్ర ప్ర‌భుత్వ తీరును ఆయ‌న‌ ఎండ‌గ‌ట్టారు.

స‌మావేశంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రిస్తూ.. వాటిని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌పై ఉంద‌న్నారు.  రానున్న ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టినుంచే స‌న్న‌ద్ధం కావాల‌ని శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

ప‌రిపాల‌నా ధ‌క్ష‌త క‌లిగిన సీయం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌లో దేశానికి ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని తెలిపారు. ఉమ్మ‌డి పాల‌న‌లో తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ప‌డ్డార‌ని, స్వ‌రాష్ట్రంలో వాటిని అధిగ‌మించి మిగితా రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నామ‌ని తెలిపారు. మ‌హారాష్ట్ర‌లో కూడా సీయం కేసీఆర్ స‌భ‌ల‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మార‌థం ప‌డుతున్నార‌ని వెల్ల‌డించారు. నాలుగున్న‌ర కోట్లు తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతుంటే….  మాన‌వ వ‌న‌రులు, స‌హ‌జ వ‌న‌రులు పుష్క‌లంగా ఉన్న భార‌త‌దేశం కేంద్ర ప్ర‌భుత్వ విధానాల వ‌ల్ల వెనుక‌బ‌డి ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప‌ట్ల  క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బీజేపీ  కేంద్ర ప్ర‌భుత్వ తీరును ఈ సంద‌ర్భంగా ఎండ‌గ‌ట్టారు.

మ‌రోవైపు మాజీ ఎమ్మెల్యే మ‌హేశ్వ‌ర్ రెడ్డి ఆ పార్టీ, ఈ పార్టీ అని చివ‌ర‌కు మ‌త‌తత్వ పార్టీ బీజేపీ లో చేరాడ‌ని ఎద్దేవా చేశారు. మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టి ఓట్లు దండుకునే బీజేపీ దేశానికి , తెలంగాణ‌కు చేసిందేమి లేద‌ని స్ప‌ష్టం చేశారు. డ‌బ్బులు, మ‌ద్యం ప్ర‌లోభాల‌తో నిన్న‌టి ర్యాలీకి జ‌న స‌మీక‌ర‌ణ చేశారని మండిప‌డ్డారు. సీయం కేసీఆర్ పై అభిమానంతో పాటు,  కొత్త‌గా ఏర్ప‌డ్డ నిర్మ‌ల్ జిల్లాను మ‌రింత అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకునేందుకే శాయ‌శ‌క్తుల కృషి చేస్తాన‌ని తెలిపారు.

తీర్మానాలివే..

వ్యవసాయం- రైతు సంక్షేమం, సామాజిక భద్రత వివిధ రకాల పెన్షన్లు, బీసీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహిళా సంక్షేమం,  దళిత సంక్షేమం, విద్య వైద్యం ఉపాధి కల్పన‌, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మైనారిటీ సంక్షేమం, ఉపాధి హామీకి ఉరి,  తొమ్మిది ఏళ్లలో నిర్మల్ శాసనసభ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ధరల పెరుగుదల మోదీ ప్రభుత్వ వైఫల్యం,  మోటార్లకు మీటర్లు,  బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం, సీఎం కేసీఆర్‌ సారథ్యంలో 125 అడుగుల అంబేద్క‌ర్  విగ్రహ ఏర్పాటుతోపాటు కొత్త సచివాలయానికి అంబేద్క‌ర్ పేరు పెట్టుకోవడం లాంటి ప‌లు తీర్మానాలు చేశారు. దీంతో పాటు రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన అనేక అంశాలపై చూపుతున్నకేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వ‌ వివక్షపూరిత వైఖరికి వ్య‌తిరేఖంగా తీర్మానాలు చేశారు.

నిర్మ‌ల్  జిల్లా కేంద్రంలో క్యాంప్ కార్యాయ‌ల‌యంతో పాటు నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ప‌లు వాడ‌ల్లో  మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.  బుల్లెట్ బండిపై మంత్రి ప‌ట్ట‌ణ‌మంతా క‌లియ తిరుగుతూ….గులాబీ జెండాను ఎగుర‌వేసి శ్రేణుల్లో జోష్ ను నింపారు.

Related posts

ఎంఐఎం అధినేతపై జాంబాగ్‌లో ప్ర‌శ్న‌ల వ‌ర్షం..

Sub Editor

భాషా ‘మిత్ర’లాభం

Satyam NEWS

స్వర్ణ దేవాలయంలో ప్రార్ధనలు చేసిన అల్లూ అర్జున్

Satyam NEWS

Leave a Comment