42.2 C
Hyderabad
May 3, 2024 15: 44 PM
Slider శ్రీకాకుళం

అంబేద్కర్ పట్ల రాజకీయ నాయకుల కపట ప్రేమ బహిర్గతం

#ambedkar

కోనసీమకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టడం,దాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన అరాచక కార్యక్రమాలు పరిశీలిస్తే అంబేద్కర్ వారసులమంటూ రాజకీయ నాయకుల కపట ప్రేమ బహిర్గతం అయ్యిందని దళిత హక్కుల పోరాట సమితి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు యడ్ల గోపి, ఏ.ఐ.టి.యు.సి.జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన.షణ్ముఖ రావు లు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం వలన,ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే కొనసీమ జిల్లా పేరు మార్చ వద్దని,అంబేద్కర్ పేరు పెట్టవద్దని అరాచక శక్తులు సాగించిన చట్ట వ్యతిరేక చర్యలు జరిగినట్లు తెలుస్తోంది. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా జీవించే హక్కు, మాట్లాడే హక్కు కల్పించిన, హుందాగా బ్రతికే అవకాశం కల్పించారని,అది మరచి మనువాద ఉన్మాదుల్లా ప్రవర్తించడం హేయమైన చర్య అన్నారు.

అంబేద్కర్ పేరుతో ఓట్లు గేలం వేసిచి పదవులు పొందుతున్న రాజకీయ నాయకుల నిజస్వరూపం కోనసీమ ఘటనతో బయటపడిందని అన్నారు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కోనసీమ అరాచక శక్తులపై సమగ్ర దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డి.హెచ్.పి.ఎస్.టెక్కలి డివిజన్ కార్యదర్శి పాల పోలా రావు, బసవల అప్పారావు, బసవల రాము, అక్కురాడ శ్రీనివాస్, ఏ.ఐ.టి.యు.సి.జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షణ్ముఖ రావు,విద్యార్థి యువజన సంఘాల ఐక్య వేదిక నాయకులు ప్రభుదేవ్ బెహరా, ఏ.పి.మెడికల్ కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నంబాళ్ళ గోవిందరాజులు, తరుణ్ బెహరా, నరసింహ బెహరా, చింతలగార భూపోరాట నాయకులు తిర్లంగి సత్యం, శిగిలిపల్లి రామ్మూర్తి లు పాల్గొన్నారు. టెక్కలి కండ్ర వీధికి చెందిన ఐదేళ్ల గౌతమ్ బెహరా కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడం తప్పు కాదంటూ ఉన్న ప్లే కార్డు పట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Related posts

పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Satyam NEWS

భూ కబ్జాకు ప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్

Satyam NEWS

గాంధీజీపై సాధు కాళీచరణ్ వ్యాఖ్యలు

Sub Editor

Leave a Comment