21.7 C
Hyderabad
November 9, 2024 04: 57 AM
Slider కృష్ణ

19న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలిరండి

#victorprasad

ఈనెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న 125 అడుగుల ఎత్తు కలిగిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ కోరారు. ఆదివారం సాయంత్రం ఆయన స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి విజయవాడలో నూతనంగా రూపుదిద్దుకున్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణపై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి దిక్సూచి, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారని, ఈ కార్యక్రమానికి కుల మత వర్గ  విభేదాలు లేకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. రాజకీయాలకు కేంద్ర బిందువు, వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతున్న విజయవాడ నడిబొడ్డున అతి ముఖ్యమైన స్థలం స్వరాజ్య మైదానంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని సముచిత స్థానం కల్పించిందుకు అంబేద్కర్ అభిమానులు, రాష్ట్ర ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు.

నాలుగు వందల కోట్ల రూపాయలతో స్వరాజ్ మైదానంలో రూపుదిద్దుకున్న అంబేద్కర్ స్మృతి వనంలోని విశిష్టతలను ఆయన వివరిస్తూ విగ్రహం మాత్రం 125 అడుగులు ఎత్తు కలిగి ఉంటుందని, మరో 80 అడుగులు గల విగ్రహం కింది భాగంలో మూడు వేల మంది కూర్చోగలిగే మల్టీ కన్వెన్షన్ హాల్, 2 వేల మంది ఆసీనులు కాగల ఓపెన్ థియేటర్, బుద్దిస్ట్ మెడిటేషన్ హాల్, ఫౌంటెన్లు, పార్కు వంటి అన్ని రకాల సదుపాయాలతో దేశంలో కనీ వినీ ఎరుగని రీతిలో అద్భుతంగా నిర్మించడం జరిగిందన్నారు.

ఈ విగ్రహాన్ని స్వేచ్ఛ, సమానత్వానికి గుర్తుగా (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, లిబర్టీ) పిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప పండుగగా నిర్వహించనున్నదని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదని, దేశంలోని ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన గొప్ప వ్యక్తి విగ్రహావిష్కరణకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని చైర్మన్ ఈ సందర్భంగా కోరారు.

Related posts

అక్రమ సంబంధం కారణంగా దారుణ హత్య

Satyam NEWS

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన అబ్సర్వర్

Bhavani

తక్షణమే ముఖ్యమంత్రి పదవిని వికేంద్రీకరించాలి

Satyam NEWS

Leave a Comment