29.7 C
Hyderabad
May 4, 2024 03: 06 AM
Slider విశాఖపట్నం

నిన్న రుయా… నేడు కేజీహెచ్: అంబులెన్సు మాఫియా అరాచకాలు

#kgh

ఆంధ్రప్రదేశ్ లో ఆసుపత్రుల వద్ద అంబులెన్సు డ్రైవర్ల మాఫియా రోగుల బంధువులను పట్టి పీడిస్తున్నది. తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద జరిగిన హృదయవిదారక సంఘటన మరువక ముందే నేడు విశాఖలోని కేజీహెచ్ లో అంబులెన్స్ డ్రైవర్ల మాఫియా ఒకరిపై దాడి చేసి దారుణంగా కొట్టారు.

ఈ అంబులెన్సు మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అర్ధం కావడం లేదు. నిన్న తిరుపతి రుయా ఆస్పత్రిలో అంబులెన్సుల అరాచకాన్ని మరువకముందే ఇప్పుడు విశాఖలోని కేజీహెచ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వైజాగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో పెనుగొల్లుకు చెందిన ఓ బాలింత బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె భర్త మనోజ్ భార్యను ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రైవేట్ వాహనాన్ని తీసుకొచ్చాడు.

భార్యను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్, వాచ్‌మెన్‌లు దాడి చేశారు. మనోజ్‌ను రక్తం కారేలా కొట్టారు. సొంత వాహనం ఉందని, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ అవసరం లేదని చెప్పినందుకు     ఇలా దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

అవసరం ఉన్నా, లేకున్నా డబ్బులు కట్టాల్సిందేనని దాడులు చేస్తున్నారు. అంతేకాకుండా ఆస్పత్రి అంతా లంచాలమయంగా మారిందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై బాధితులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసి బాధితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Related posts

పారిశుద్ధ్య పనుల్లో ఉండేవారికి ప్రొటెక్షన్ తప్పని సరి

Satyam NEWS

పోలీస్ అంటే ఉద్యోగం కాదు అత్యుత్తమ సేవ

Satyam NEWS

క్రమబద్ధీకరణ పేరుతో వీలీనం

Murali Krishna

Leave a Comment