42.2 C
Hyderabad
May 3, 2024 17: 45 PM
Slider ఖమ్మం

క్రమబద్ధీకరణ పేరుతో వీలీనం

#sfi

తెలంగాణ రాష్ట్రంలో కెబినేట్ సబ్ కమిటి 50 మంది కంటే తక్కువ విద్యార్ధులు ఉన్న హస్టల్స్ దగ్గరలోని హస్టల్స్ లో వీలీనం చేయడం, పోస్ట్ మెట్రిక్ హస్టల్స్ గా మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ ఆరోపించారు.  ఖమ్మం నగరంలోని హాస్టల్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఈ ఆలోచన విరమించుకోవాలని  ఆయన  డిమాండ్ చేశారు. పేద విద్యార్ధులు ప్రధానంగా గ్రామీణ, ఆదివాసీ, దళిత విద్యార్ధుల విద్యాభివృద్ధికి పట్టుకోమ్మలుగా హస్టల్స్ ఉన్నాయి. విద్యార్ధులను దగ్గరలో ఉన్న హైస్కూల్స్ నుండి హస్టల్స్ లో చేర్పించాల్సిన భాద్యత ప్రభుత్వానిది కానీ వారికి మెరుగైన సదుపాయాలు,మెస్ కాస్మోటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచకుండా నిధులు ఇవ్వకుండా వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. వాటీని అభివృద్ధి పర్చకుండా వీలీనం పేరుతో, క్రమబద్ధీకరణ పేరుతో మూసివేసే కుట్రలు చేయడం దుర్మార్గపు చర్య తక్షణమే నిధులు మంజూరు చేసి హస్టల్స్ సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వలన ఈ రోజు జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో చదువుకునేటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువులకు దూరమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాని హెచ్చరించారు.  కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకురాళ్లు రాగిణి,శ్రావ్య నిఖిత, భవితశ్రీ, ప్రవళిక భాను ,రమ్య ,అంజలి ,నవ్య శరీఫా తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇళ్ళ పట్టాలు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు

Bhavani

ఘనంగా అల్వాల్ లయోలా అకాడమీ  టెక్నోవగాంజా 2023

Satyam NEWS

నిజాయితీగా వ్యాపారం చేయకపోతే చర్యలు

Bhavani

Leave a Comment