27.7 C
Hyderabad
May 7, 2024 09: 07 AM
Slider ఆధ్యాత్మికం

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

#TTD

నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మే 13 నుండి 21వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 8న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 12న అంకురార్పణం నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు

తేదీ                 ఉదయం           సాయంత్రం

13-05-2022    ధ్వజారోహణం    పెద్దశేష వాహనం

14-05-2022    చిన్నశేష వాహనం    హంస వాహనం

15-05-2022     సింహ వాహనం        ముత్యపుపందిరి వాహనం

16-05-2022     కల్పవృక్ష వాహనం     సర్వభూపాల వాహనం

17-05-2022     మోహినీ అవతారం      గరుడ వాహనం

18-05-2022     హనుమంత వాహనం గజ వాహనం

19-05-2022     సూర్యప్రభ వాహనం      చంద్రప్రభ వాహనం

20-05-2022     రథోత్సవం కల్యాణోత్సవం, అశ్వవాహనం

21-05-2022     చక్రస్నానం              ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీ రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.1000/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Related posts

భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికే రాజధాని మార్పు

Satyam NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వేముల

Satyam NEWS

అశోక్ గౌడ్ కు మాతృవియోగం: పరామర్శించిన ములుగు జడ్పీ చర్మన్

Satyam NEWS

Leave a Comment