31.7 C
Hyderabad
May 2, 2024 08: 16 AM
Slider అనంతపురం ముఖ్యంశాలు

పర్యాటకులకు ఆహ్లాదకరంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్

#Allola Indrakaran

వన్యప్రాణులకు హాని చేసే ప్లాస్టిక్ కు అడవులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పర్యాటకులకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎంతో ఆహ్లాదకరమైనదని ఆయన అన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచడంలో భాగంగా శుక్రవారం ఉదయం మన్ననూర్ లోని వనమాలిక లో నూతనంగా నిర్మించిన 6 కాటేజీ లు, 8 సఫారీ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ విప్, అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములు,

జడ్పి చైర్మన్ శాంతికుమారి, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్, అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ను విశేషంగా అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లలో నివసించే స్థానిక గిరిజన, చెంచు, ఆదివాసీలను అటవీ సంరక్షణ సిబ్బంది, వాచర్ లు ఇతర ఉపాధి కల్పించడం ద్వారా అడవిలో కలప చౌర్యం పూర్తిగా ఆగిపోయిందని, వన్యప్రాణుల సంఖ్య అందువల్ల వన్యప్రాణుల సంరక్షణ,

చెట్ల అభివృద్ధి బాగా పెరిగిందన్నారు. తద్వారాఅడవుల ప్రత్యేకత కాపాడుతూనే, పర్యావరణ హిత టూరిజం అందుబాటులోకి తెస్తామని తెలియజేసారు. రాష్ట్రంలో బాధ్యతా యుతమైన, పర్యావరణ ఈకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని అన్నారు. దీనిలో భాగంగా అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వుల సమీపంలో మరిన్ని ఎకో టూరిజం ప్రాంతాలను అభివృద్ది చేస్తామని తెలిపారు.

Related posts

“ఏక్ భారత్- ఆత్మనిర్భర్ భారత్- శ్రేష్ఠ భారత్” కోసం కదలి రండి

Satyam NEWS

శ్రీలక్ష్మి అవుతు కు జెఎన్ టెయు నుంచి డాక్టరేట్

Satyam NEWS

సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణం మీకు ఇష్టం లేదా సారూ?

Satyam NEWS

Leave a Comment