40.2 C
Hyderabad
May 2, 2024 16: 02 PM
Slider ముఖ్యంశాలు

శ్రీలక్ష్మి అవుతు కు జెఎన్ టెయు నుంచి డాక్టరేట్

#srilata

హైదరాబాద్ వాసవి ఇంజనీరింగ్ కళాశాల లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీలక్ష్మి అవుతు హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్  విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ కోసం ఆమె రాసిన థీసిస్‌ను ఆమోదించి  పిహెచ్ డి  డిగ్రీ అవార్డు ప్రదానం చేశారు. శ్రీలక్ష్మి తన  థీసిస్‌ లో మైక్రోచిప్ వైడ్ బ్యాండ్ అంటీనా లో  వున్న  ప్రస్తుత సమస్యలకు పరిష్కారం చూపారు. మైక్రోచిప్ వైడ్ బ్యాండ్ అంటీనా అనేవి వివిధ ఫ్రీక్వెన్సీ లలో అధిక డేటా, ఆడియో మరియు వీడియో సమాచారం తక్కువ సమయం లో ప్రసారం చేయడానికి ఉపయోగ పడే ఎలక్ట్రానిక్ సాధనం.

ఆధునిక వైర్లెస్ కమ్యూనికేషన్ విభాగం లో నిర్మాణాత్మక వైడ్ బ్యాండ్ అంటెన్నా స్ట్రక్చర్స్ కి వినియోగదారుల నుండి డిమాండ్ పెరిగింది. వివిధ మొబైల్, శాటిలైట్, రాడార్ మొదలగు అప్లికేషన్స్ వైడ్ బ్యాండ్ అంటెన్నలను వినియోగిస్తారు. మైక్రోస్ట్రిప్ వైడ్ బ్యాండ్ అంటీనా ఎర్రే కు కావాల్సిన డిజైన్స్ లను రూపొందించి, భద్రత, ఎన్క్రిప్షన్, లో ప్రొఫైల్ గోప్యత తో కూడిన వేగవంతమైన ప్రసారం కోసం శ్రీలక్ష్మి ప్రామాణికరమైన పరిష్కార మార్గాన్ని రూపొందించి అమలు చేశారు.

చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈసిఈ  విభాగ  ప్రోఫెసర్ ఎన్ వి .కోటేశ్వరరావు, జే ఎన్ టి యూ ఈసిఈ ప్రొఫెసర్ డి .శ్రీనివాసరావు పర్యవేక్షణలో శ్రీలక్ష్మి  తన థీసిస్‌ రాసినట్టు తెలిపారు. ఈ సందర్బంగా శ్రీలక్ష్మి వాసవి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కు , ప్రిన్సిపాల్ ఎస్ వి రమణ కి , ఈసీఈ విభాగ అధిపతి ప్రొఫెసర్ ఈ.శ్రీనివాసరావుకి  ధన్యవాదాలు తెలిపారు. వాసవి ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు , మరియు స్నేహితులు  శ్రీలక్ష్మి అవుతు కు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

లాక్ డౌన్ లో పేదలను ఆదుకోవడం సామాజిక బాధ్యత

Satyam NEWS

తాలూక స్థాయి  క్రికెట్ కార్క్ బాల్ క్రికెట్ టోర్నీ విజేతగా కుడికిళ్ళ టీం

Satyam NEWS

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘనంగా నివాళులు

Satyam NEWS

Leave a Comment