28.7 C
Hyderabad
May 15, 2024 02: 28 AM
Slider వరంగల్

అర్హులకే అంగన్వాడీ ఆయా పోస్టు కేటాయించాలి

#bhoopalapally

స్థానికంగా ఉంటూ, అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థికే అంగన్వాడీ ఆయా పోస్ట్ కేటాయించాలని ఎల్లారెడ్డి పల్లి గ్రామస్తులు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో అంగన్వాడీ ఆయా పోస్టు ఖాళీగా ఉండడంతో ఆ పోస్టుకు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయగా, కొందరు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు.

అందులో వేరే గ్రామంలో నివాసం ఉంటున్న అభ్యర్థులకు ఆయా పోస్టు ఇప్పించేందుకు పైరవీకారులు రంగంలోకి దిగారు. దీంతో అర్హత కలిగిన అభ్యర్థికి ఆయా పోస్టు దక్కే అవకాశం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎలాంటి పైరవీలు లేకుండా అర్హత కలిగిన వారినే అంగన్వాడీ ఆయా పోస్టుకు ఎంపిక చేస్తామని తెలిపినప్పటికీ, పైరవీకారులు మాత్రం గ్రామంలో లేని వారిని ఎంపిక చేయాలని ప్రజాప్రతినిధులపై, సంబంధిత అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

పెట్టే విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, సంబంధిత అంగన్వాడీ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంగన్వాడీ ఆయా పోస్టు ఎంపికలో అధికారులు పారదర్శకత పాటించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Satyam NEWS

ప్రతి పేదవాడికి వైద్యం అందించేందుకే బస్తీ ద‌వాఖానాలు

Satyam NEWS

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవాలని రామాలయంలో పూజలు

Satyam NEWS

Leave a Comment