29.7 C
Hyderabad
April 29, 2024 07: 06 AM
Slider విజయనగరం

విశాఖ రేంజ్ డీఐజీ న‌గరానికి రాక‌….పోలీసుల బందోబ‌స్తు హ‌డావుడి…!

#vijayanagarampolice

విశాఖ రేంజ్ డీఐజీ రంగ‌రావు జిల్లా కేంద్రానికి వ‌చ్చిన సంద‌ర్భంలో అటు ట్రాఫిక్ పోలీసులు,ఇటు లా అండ్ ఆర్డ‌ర్ పోలీసులు హైరానా తీవ్రంగా క‌నిపించింది. ప్రోటోకాల్ ప్ర‌కారం… డీఐజీ వ‌స్తున్నార‌న్న స‌మాచారం బ‌ట్టి…సంబందిత డివిజ‌న్ పోలీసులు బందోబ‌స్తు  నిర్వ‌హ‌ణ లో అతి జాగ్ర‌త్ర‌గా వ్య‌వ‌హ‌రించాలి.

అయితే విజయనగరం యూత్  ఫౌండేషన్ .క‌రోనా వారియ‌ర్స్ ను స‌న్మానించేందుకు విశాఖ రేంజ్ డీఐజీ వ‌స్తున్నార‌న్న స‌మాచారం తెలుసుకున్నారు…. విజ‌య‌న‌గ‌రం స‌బ్ డివిజ‌న్ పోలీసుల‌కు  ఆ ర‌కంగా విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ   త‌న శాఖా సిబ్బందిని అలెర్ట్ చేసారు. అలాగే ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు కూడా.త‌న బీట్ కానిస్టేబుళ్ల‌ను త‌న వ‌ద్ద ఉన్న మేన్ ప్యాక్ ద్వారా సిద్దం గా ఉండ‌మ‌ని చెప్పారు కూడ.

ఇదిలా  ఉంటే  ప‌నిలో ప‌నిగా జిల్లాలోని ఎస్ఐ ర్యాంకు పోలీస్ సిబ్బందితో మీటింగ్ పెట్టాల‌ని  విశాఖ రేంజ్ నుంచీ ఆదేశాలు రావ‌డంతో జిల్లా పోలీస్ శాఖ ముందుగా దండు మార‌మ్మ దేవాల‌యంలో స‌మావేశం  ఏర్పాటు చేసింది. ఆ తర్వాత  డీపీఓ లోని బేర‌క్స్  లో ప‌రివ‌ర్త‌న పేరుతో కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసింది. స‌మాచారం తెలుసుకున్న మీడియాతో పాటు ఏఎస్పీ, డీఎస్పీ ఇలా యావ‌న్మంది సిబ్బంది అంతా బేర‌క్స్ లో డీఐజీ రాక‌కై సిద్దంగా ఉన్నారు.

అంత‌లోనే  రేంజ్ డీఐజీ ముందుగా విజయనగరం యూత్  ఫౌండేషన్  కార్య‌క్ర‌మానికి వెళుతున్నార‌ని తెలియంగానే ఏఎస్పీ,డీఎస్పీలు అంతా  త‌క్ష‌ణం త‌మ‌,త‌మ వాహ‌నాల‌లోఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద రెవిన్యూ హోంకు చేరుకున్నారు.కానీ అప్ప‌టికే రేంజ్ డీఐజీ రంగారావు, ఎస్పీ దీపికా ఎం పాటిల్  రెవిన్యూ హోంలో విజయనగరం యూత్  ఫౌండేషన్  నిర్వ‌హిస్తున్న క‌రోనా వారియ‌ర్స్ స‌న్మాన సన్మాన స‌భ‌కు  వ‌చ్చేసారు.

ఆ త‌ర్వాత ఏఎస్పీలు ఇద్ద‌రూ విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ,ట్రాపిక్ డీఎస్పీలు ప్రోటో కాల్ ప్ర‌కారం అక్క‌డ‌కి వ‌చ్చి బందోబ‌స్తు నిర్వ‌హించారు. ఈ బందోబ‌స్తులో పోలీసు ఉన్న‌తాదికారుల‌తో పాటు విజ‌య‌న‌గ‌రం వ‌న్ టౌన్,టూటౌన్,రూర‌ల్ సీలు,మురళీ,ల‌క్ష్మ‌ణ‌రావు,మంగ‌వేణి ఎస్ఐలు నారాయ‌ణ‌,కృష్ణ ప్ర‌సాద్, కిర‌ణ్  లు పాల్గొన్నారు.

Related posts

అంబర్పేట్ లో కారుదే జోరు: మిగతావారు బేజారు

Satyam NEWS

కోడూరు మస్తాన్ రెడ్డికి ఎంపీ ఆదాల శ్రద్ధాంజలి

Bhavani

నిందితులు 190 మందిని ఎన్ కౌంటర్ చేయాలి

Satyam NEWS

Leave a Comment