38.2 C
Hyderabad
May 3, 2024 19: 52 PM
Slider నల్గొండ

టెన్షన్:అమృతను వెనక్కి పంపిన బంధువులు

angry relatives return backs amrutha from maruthirao funarals

మారుతీరావు మృతదేహాన్ని కడసారి చూసి, నివాళులు అర్పించేందుకు అమృత మిర్యాలగూడలోని స్మశాన వాటిక కు చేరుకోగా ఆమె రాకతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది.అమృత రాకను వ్యతిరేకిస్తూ బంధువులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం తో దూరం నుండే తండ్రిని చివరి సారిగా చూసి తిరిగివెళ్ళిపోయింది.

నివాళులు అర్పించిన అమృత తన తండ్రిని చూడాలని అమృత భావిస్తే, తానేమీ అడ్డుకోబోనని, ఈ విషయంలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని మారుతీరావు సోదరుడు శ్రవణ్ తెలుపడం తో పోలీసులు, మరోసారి శ్రవణ్ ను, మారుతీరావు బంధువులను సంప్రదించి, అమృతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంటి వద్దకు కాకుండా స్మశానానికి తీసుకుని వెళతామని చెప్పి, ఆమెను భారీ బందోబస్తు మధ్య పోలీసు వాహనంలోనే తీసుకుని వచ్చారు.

అమృతతో పాటు ప్రణయ్ కుటుంబీకులు కూడా కొందరు రావడంతో, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, పోలీసులు రోప్ పార్టీని ఏర్పాటు చేసి, వారి చుట్టూ కాపలా ఉన్నారు.అమృత స్మశాన వాటికకు చేరుకోగానే మృతుని బంధువులు స్నేహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శవానికి అడ్డం గా నిలుచున్నారు.ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు వద్దని వారించడం తో బయటనుండే తండ్రి మృతదేహానికి నివాళులు అర్పించింది.

కాగా, సోదరుడు శ్రవణ్, మారుతీరావు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.తండ్రిని చివరి చూపు చూడటానికి రాలేదని అంటరాని అమృతపోలీస్ సహాయం తో అంత్య క్రియలకు హాజరు కాగా ఆమెను బంధువులు అడ్డుకోవడం తో ఇంకా ఈ రెండు కుటుంబాల మధ్య ఇప్పట్లో సయోధ్య కుదిరేలా లేదని ప్రజలు భావిస్తున్నారు.

Related posts

4276 చెక్కులకు గాను రూ. 18.58 కోట్లు పంపిణీ

Murali Krishna

యూపీలో రాబోయే ముఖ్యమంత్రి ఎవరు.. సర్వే

Sub Editor

తెలంగాణను ముంచెత్తుతున్న భారీ వర్షాల పట్ల అప్రమత్తం

Satyam NEWS

Leave a Comment