38.2 C
Hyderabad
May 1, 2024 20: 33 PM
Slider ఖమ్మం

4276 చెక్కులకు గాను రూ. 18.58 కోట్లు పంపిణీ

#cmrf

వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స అనంతరం సీఎంఆర్‌ఎఫ్‌కి స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ సిఫారసు మేరకు దరఖాస్తు చేసుకుని మంజూరైన చెక్కులను  క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అందజేశారు.నియోజకవర్గ పరిధిలో మంజూరైన మొత్తం 157 మందికి గాను రూ.59.96 లక్షల విలువైన చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. నేటి వరకు 4276 చెక్కులకు గాను రూ. 18.58కోట్ల విలువైన చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. గతంలో రూ.10వేలు మంజూరు అయితే చాలా గొప్ప విషయం అని అన్నారు. స్థానిక శాసన సభ్యుడిగా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు సి‌ఎం‌ఆర్‌ఎఫ్  చెక్కుల ప్రవాహం నిర్విరామంగా కొనసాగుతుందని, ఇలానే కొనసాగుతూనే ఉంటుంది అని స్పష్టం చేశారు. పేదరికంలో ఉండి అతి కష్టం మీద వైద్య చేయించుకున్న వారికి ఆర్ధిక సహకారం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ కల్పించిన మంచి సదవకాశం అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందిస్తున్నామని, అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో అత్యవసర సందర్భాల్లో ఇతర ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకున్న పేదలకు ప్రభుత్వం చేదోడుగా ఉండాలని సి‌ఎం‌ఆర్‌ఎఫ్ ను కల్పించిందన్నారు.ప్రజల సౌకర్యార్థం క్యాంపు కార్యాలయంలో నిత్యం ఒక వ్యవస్థ సి‌ఎం‌ఆర్‌ఎఫ్  కోసమే పని చేస్తుందని ప్రజలు ఈ సౌకర్యాన్ని మరింతగా సద్వినియోగించుకోవాలని కోరారు.కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, కార్పొరేటర్లు పసుమర్తి రాంమోహన్, పాకాలపాటి విజయ, దందా జ్యోతి రెడ్డి,  శ్వేత, నాయకులు కన్నం ప్రసన్న కృష్ణ,  నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, రుద్రగాని ఉపేందర్, తోట వీరభద్రం, షకీనా, ఇస్సాక్ రఘు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రెడ్డిలను విస్మరిస్తే కేసీఆర్ కు సత్తా చూపిస్తాం

Satyam NEWS

కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

Satyam NEWS

బిజెపికి మొఖం చెల్లకే ఈడి సిబిఐల తో దాడులు

Satyam NEWS

Leave a Comment