39.2 C
Hyderabad
May 3, 2024 12: 58 PM
Slider నల్గొండ

సెకండ్ ఏ ఎన్ ఎం లను తక్షణమే రెగ్యులర్ చేయాలి

#yaragani

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏ ఎన్ ఎం లను తక్షణమే రెగ్యులర్ చేయాలని,వారికి ఉద్యోగ జీవిత భద్రత కల్పించాలని,సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గత 16వ,తేదీ నుండి నిరసన తెలుపుతున్న ఏ ఎన్ ఎం ల నిరసన దీక్ష శిబిరాన్ని గురువారం ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ సందర్శించి తమ పూర్తి మద్దతును తెలిపారు.

ఈ సందర్భంగా యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ బి ఆర్ ఎస్ గా మారిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి వీఆర్ఎస్ దగ్గర పడ్డదని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సమాన పనికి, సమాన వేతనం ఇవ్వాలని,సెకండ్ ఏ ఎన్ ఎం లను తక్షణమే రెగ్యులర్ చేసి వారికి జీవిత భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమానికి ఏ ఐ టి యు సి రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా,ఐ ఎన్ టి యు సి నాయకులు బంటు చొక్కాయ్య గౌడ్,చింతకాయల రాములు తదితరులు పాల్గొని మాట్లాడారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

అన్ని శాఖల సమన్వయంతోనే గృహ నిర్మాణాలలో పురోగతి

Satyam NEWS

ది ఫైట్ కంటిన్యూస్: రాయపూడిలో మహిళల జలదీక్ష

Satyam NEWS

మళ్లీ రణరంగమైన విజయనగరం కలెక్టరేట్

Satyam NEWS

Leave a Comment