28.7 C
Hyderabad
April 28, 2024 07: 43 AM
Slider అనంతపురం

అన్ని శాఖల సమన్వయంతోనే గృహ నిర్మాణాలలో పురోగతి

#basanthkumar

పేదలందరికీ ఇల్లు గృహ నిర్మాణ కార్యక్రమం అనేది అన్ని శాఖల సమన్వయంతోనే సాధ్యం అని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి  కలెక్టర్  బసంత కుమార్ పేర్కొన్నారు. శనివారం గోరంట్ల మండలంలోని మల్లాపల్లి,300 గృహములు మారెమ్మ గుడి 417 గృహములు లే అవుట్ లో నందలి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం నందలి గృహ నిర్మాణాలను పనులను  జిల్లా కలెక్టర్ పరిశీలించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ అధికారి చంద్రమౌళీశ్వర్ రెడ్డి సంబంధిత అధికారులు  తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు బృహత్తర పథకం అమలులో తాసిల్దార్లు ఎంపిడిఓ లు లేఔట్ ల వారీగా బాధ్యతలు పంచుకుని హౌసింగ్ అధికారులతో  సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పనితీరులో నిర్లక్ష్య వైఖరి ఉపేక్షించేది లేదని చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇంజినీరింగ్ అసిస్టెంట్ లు ఇళ్ళ నిర్మాణాల బిల్లులు అప్లోడ్ చేయకుండా, పేమెంట్ లు  చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇంటి ఇంటికి త్రాగు నీటి సౌకర్యం, విద్యుత్తు, అంతర్గత రోడ్లు ఏర్పాటు కావాలని అన్నారు.ఉగాది నాటికి సామూహిక గృహ ప్రవేశాలకు సంబంధించిన లక్ష్యాలను అందిపుచ్చుకోవాలి అన్నారు. 

సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి లేఅవుట్లకు ఇంఛార్జి లను లబ్దిదారుల వారీగా లక్ష్యాల వారీగా ఉత్తర్వులు జారీ చేసి ప్రతులను ఈ రోజు జిల్లా కేంద్రానికి పంపాలని ఆదేశించారు. ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని, కలెక్టరేట్ నుండి రోజు వారీగా సమీక్షిస్తామని స్టేజి వారీగా పురోగతి సాధించాలని అన్నారు.

ఎక్కడైతే సిమెంట్, కడ్డీలు, వాకిళ్ళు, లోగో లు తదితర సామాగ్రి సిద్ధంగా ఉన్నవాటిని, లబ్ధిదారులను మోటివెట్ చేసి వాటి జాబితా సిద్ధం చేసి నిర్మాణం చేపట్టాలని ఆర్ ఎల్ ఆర్ సీ స్థాయి నుండి పూర్తి స్థాయికి స్టేజి కన్వర్షన్ రావడానికి ముందస్తుగా అవగాహన చేసుకుని లక్ష్యాలు నిర్ణయించుకుని అధికారులు ఉదయమే లబ్ధిదారులను  మోటివెట్ చేసి పురోగతి సాధించేలా చర్యలు ఉండాలని అన్నారు.

ఇంకా ప్రారంభం కాని ఇళ్లను ప్రారంభించాలని, గోడ స్థాయి పై కప్పు స్థాయి నుండి పూర్తి స్థాయి కి తీసుకు రావాలని అన్నారు.  ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్షించారు గోరంట్ల మండలంలో1351 ఇల్లు పూర్తి చేయాలి.435 ఇల్లు పునాది స్థాయిలోనివి.401 ఇల్లు గోడల స్థాయిలోనివి 515 ఇల్లు పైకప్పు స్థాయిలో ఉన్నవి మొత్తము ఇల్లు ఉగాది నాటికిపూర్తి చేయవలసి ఉన్నదని తెలిపారు.

లేవుట్లను నందు  మౌలిక సదుపాయాల పైన విద్యుత్ సదుపాయాన్ని వారం రోజు లోపల పూర్తిచేయాలని  విద్యుత్ ఏఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రంగనాయకులు, ఎంపీడీవో రఘునాథ్ గుప్తా,  విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు, ఏపీఎం నారాయణ, జడ్పిటిసి జై రామ్ నాయక్, ఎంపీపీ ప్రమీల మూర్తి సంబంధిత అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతులకు ఉచితంగా బయో గ్యాస్ ప్లాంట్ల నిర్మాణం

Satyam NEWS

నేడు బ్రిటన్ ప్రధాని రాజీనామా చేసే అవకాశం

Satyam NEWS

మున్సిపల్ కౌన్సిలర్లను శ్రీ పోలేరమ్మ సాక్షిగా అభినందించిన ఆనం

Satyam NEWS

Leave a Comment