28.7 C
Hyderabad
May 6, 2024 02: 51 AM
Slider జాతీయం

శ్రద్ధా వాకర్ హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యం

#aftab

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. శ్రద్ధ పుట్టిన రోజు సందర్భంగా ఆమె తండ్రి బహూకరించిన బంగారు ఉంగరాన్ని హత్యానంతరం ఆఫ్తాబ్ తన వద్దే ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఆ ఉంగరాన్ని డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్న మరొక అమ్మాయికి ఇచ్చాడు. శ్రద్ధ శరీరభాగాలు ఫ్రిజ్ లో దాచి ఉంచిన సమయంలోనే ఆఫ్తాబ్ మరొక అమ్మాయితో డేటింగ్ చేసి ఆమెను తన ఫ్లాట్ కే పిలిచాడు. ఫ్లాట్ కు వచ్చిన ఆ యువతికి ఈ ఉంగరాన్ని బహూకరించాడు.

నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా తన స్నేహితురాలికి ఈ ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రద్ధా హత్య కేసులో ఇదొక కీలక సాక్ష్యంగా పోలీసులు భావిస్తున్నారు. ఆ యువతి కూడా ఈ మేరకు సాక్ష్యం ఇచ్చింది. శ్రద్ధ ను హత్య చేసి శరీరాన్ని 35 భాగాలు చేసిన నిందితుడు ఆఫ్తాబ్ శ్రద్ధ తల నుంచి వెంట్రుకలను వేరు చేశాడు. ఛత్తర్‌పూర్ అడవుల్లో శ్రద్ధ వెంట్రుకలను పోలీసులు గుర్తించారు. శ్రద్ధా జుట్టు కూడా ఆమె తండ్రి DNAతో సరిపోయింది. 

నిందితుడు అఫ్తాబ్ మొదట శ్రద్ధ తల నరికి చంపాడని, ఆపై కత్తెరతో ఆమె తలపై వెంట్రుకలను కత్తిరించాడని మరో ఢిల్లీ పోలీసు అధికారి తెలిపారు. ఈ వెంట్రుకలను కత్తిరించి ప్యాకెట్‌లో ఉంచాడు. ఛత్తర్‌పూర్ అడవుల్లో పోలీసులు ఈ ప్యాకెట్‌ను గుర్తించారు. ఈ వెంట్రుకలను డీఎన్‌ఏ పరీక్షకు పంపారు. శ్రద్ధ జుట్టు DNA ఆమె తండ్రి, సోదరుడితో DNA మ్యాచింగ్ జరిగింది. ఇంతకుముందు, శ్రద్ధా ఎముకలు మరియు రక్తం DNA మ్యాచింగ్ కూడా జరిగింది.

Related posts

కొల్లాపూర్ ఎస్ఐ పై దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

Satyam NEWS

తల్లితో సహజీవనం చేసి కూతురిపై కన్నేసి పది మందిని చంపేసి

Satyam NEWS

వెంకన్న పింక్ డైమండ్ కథ కంచికేనా?

Satyam NEWS

Leave a Comment