Slider జాతీయం

ఏపి గవర్నర్ గా కర్నాటక సిఎం యడ్యూరప్ప?

#yadurappa

ఏపి గవర్నర్ గా ప్రస్తుత కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను నియమించబోతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం యడ్యూరప్ప అభిప్రాయాన్ని కూడా ఇప్పటికే తీసుకున్నారని తెలిసింది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పదవీ కాలం ఈనెల 23వ తేదీతో ముగియనుంది. ఈ లోపునే నిర్ణయం తీసుకుంటారా లేక తెలంగాణ గవర్నర్ తమిళసై కి కొద్ది కాలం అదనపు బాధ్యతలు ఇచ్చి ఆ తర్వాత యడ్యూరప్పను గవర్నర్ గా నియమిస్తారా అనే విషయం తేలలేదు.

ఇందులో భాగంగానే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సదానంద గౌడ ను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించి సొంత రాష్ట్రానికి పంపారు. యడియూరప్ప వర్గానికి చెందిన శోభా కరంర్లాజేకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు.

అలాగే,మరో ఇద్దరు యడ్యూరప్ప వర్గం ఎంపీలకు కూడా మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఇక మిగిలింది యడ్యూరప్పను తప్పించి ఆయన స్థానంలో సదానంద గౌడను ముఖ్యమంత్రిని చేయడమే అని పార్టీ వర్గాల సమాచారం.

ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకున్న వెంటనే యడ్యూరప్పను ఆంధ్రప్రదేశ్ గవర్నర్’గా నియమించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

Related posts

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Satyam NEWS

రాజధాని కేసుల విచారణ రేపటికి వాయిదా

Satyam NEWS

పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు వైసీపీ నేతల అభినందనలు

Satyam NEWS

Leave a Comment