26.2 C
Hyderabad
January 15, 2025 17: 18 PM
Slider ప్రపంచం

టెర్రిఫిక్:ఆప్ఘనిస్తాన్ విమాన ప్రమాదం 83 మంది మృతి?

apghanistan plane crash 83 died

ఆప్ఘనిస్తాన్ లో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది.ఆప్ఘనిస్తాన్ లోని ఘజ్ని ప్రావిన్షియల్ లో ప్రయాణీకులతో కూడిన ఓ విమానం సోమవారం కూలిపోయిందని ఆ దేశ జాతీయ మీడియా తెలిపింది. విమానం కులాగానే దానికి నిప్పటుకున్నట్లు తెలుస్తుంది . ఆ సమయం లో విమానం లో 83 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి ఆరిఫ్ నూరి ఈ ప్రమాదాన్ని ధృవీకరించారు.అయితే మృతులు ఎంత మంది ఎందరికి గాయాలు తగిలాయి ఇంకా వివారాలు తెలియాల్సి ఉంది.

కాగా ప్రమాదాన్ని చుస్తే అందులో ప్రయాణిస్తున్న మొత్తం మంది చనిపోయి ఉంటారని సమాచారం.అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం స్థానిక సమయం మధ్యాహ్నం 1:10 గంటల సమయంలో ఘజ్ని ప్రావిన్స్ లోని దేహ్ యాక్ జిల్లాలోని సాడో ఖేల్ ప్రాంతంలో కూలిపోయింది” అని ఆయన చెప్పారు.

ఈ విమానం అరియానా ఎయిర్‌లైన్స్‌కు చెందినదని నూరి చెప్పినప్పటికీ, తమ విమానం కాదని ఆ కంపెనీ ప్రకటించింది. అది మా విమాన కాదా అని మేము పరిస్థితిని సమీక్షిన్నాము.మా విమానాలు ఎక్కడ ఎక్కడికి వెళ్ళాయో అని తెలుసుకుంటున్నాము అని అరియానా ఎయిర్లైన్స్ డైరెక్టర్ అలెం ఇబ్రహీమి చెప్పారు. ఐతే ఈ ప్రావిన్స్ తాలిబాన్ల నియంత్రణలో ఉన్నందున రెస్క్యూ బృందాలకు పంపించడానికి ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. ఏదైనా సాంకేతిక లోపం వల్ల విమానం కూలిందా లేదా తాలిబన్లు ఈ ఘాతుకానికి తెగబడ్డారా అనే విషయాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. విమానం కూలిన ప్రదేశానికి ప్రత్యేక బలగాలను పంపించినట్లు అధికారులు తెలిపారు.భారీ భద్రత ఉంటె తప్ప అక్కడికి వెళ్లే అవకాశం లేదని సమాచారం.

Related posts

వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించాలి: డిజిపి

Satyam NEWS

వైజాగ్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం: ముగ్గురి అరెస్టు

Satyam NEWS

భోగి వేడుకల్లో ప్రభుత్వ జీవో ప్రతుల దహనం

Satyam NEWS

Leave a Comment