33.2 C
Hyderabad
May 4, 2024 02: 28 AM
Slider నల్గొండ

కలెక్టర్ కావాలన్న యువతి స్వప్నానికి అన్నపురెడ్డి అప్పిరెడ్డి చేయూత

#appireddy

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం లోని‌ చింతలపాలెం మండలానికి చెందిన లకావత్ రామారావు (లేటు) కుమార్తె లావణ్యకు చిన్నతనం నుండి కలెక్టర్ కావాలన్న కోరిక బలంగా ఉంది.అందుకు అనుగుణంగా కష్టపడి చదివి మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేసింది.యు పి ఎస్ సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం కోసం కోచింగ్ తీసుకోవాలనుకుంది. కానీ తండ్రి లేకపోవడం,కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రాన ఉండడంతో ఐఏఎస్ కావాలన్న తన కోరిక  తీరదని భావించింది.

లావణ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వర్క్ కాగ్,మైక్ టీవీ కంపెనీ అధినేత అన్నపురెడ్డి‌‌ అప్పి రెడ్డి ఆమె కోచింగ్ ఫీజులు భరించేందుకు ముందుకు వచ్చారు.  కార్పోరేట్ సామాజిక బాధ్యత ( సి.యస్. ఆర్ ) కింద ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని లావణ్యకు అందించారు.ఈ సందర్భంగా లావణ్యతో వీడియో కాల్ లో అప్పిరెడ్డి మాట్లాడారు. బాగా చదవుకుని మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని కోరారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి తన వంతు సహాయం ఎల్లప్పుడూ చేస్తానని అప్పిరెడ్డి తెలిపారు.ఆ తరువాత లావణ్యతో బిగ్ బాస్ ఫేమ్,హీరో సోహైల్ మాట్లాడారు. ఐఏఎస్ అయ్యి తెలంగాణకు మంచి పేరు తేవాలని అన్నారు.తనకు ఆర్థిక సహాయాన్ని అందజేసి ప్రోత్సహించిన అప్పి రెడ్డి కి ఎప్పుడూ ఋణపడి ఉంటానని విద్యార్థిని లకావత్ లావణ్య తెలిపారు. 

ఈ కార్యక్రమంలో వర్క్ కాగ్ అధినేత అన్నపురెడ్డి అప్పిరెడ్డి,చక్రధర్,హీరో సోహెల్, శ్రీనివాస్ రెడ్డి,రవి సజ్జల,చరిత్ జూలూరి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

వర్షాలతో రైతులకు ఇబ్బంది రాకుండా చర్యలు

Satyam NEWS

భారతీయ పతాకాన్ని అందరూ గౌరవించాలి

Satyam NEWS

పరిటాల సునీత పాదయాత్రను అడ్డుకోలేదు: డీఎస్పీ

Bhavani

Leave a Comment