27.7 C
Hyderabad
May 4, 2024 08: 56 AM
Slider వరంగల్

వర్షాలతో రైతులకు ఇబ్బంది రాకుండా చర్యలు

#paddy

తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు శుక్రవారం నాడు ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరునర్సాపూర్, వాడేగుడం,  రాజుపేట పిపిసి సెంటర్స్ లను అదనపు కలెక్టర్ రెవిన్యూ డి. వేణుగోపాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా బండారీగూడెం పిపిసి సెంటర్ ను ఆయన ప్రారంభించారు. వర్షాల ప్రభావం వలన ధాన్యం తడవ కుండా తగు జాగ్రతలు తీసుకోవాలని పిపిసి సెంటర్స్ ఇంఛార్జి లకు ఆయన సూచించారు. రైతులకు అవసరమైన టార్పాలిన్ లను అందుబాటులో ఉంచాలని ఆయన తగు సూచనలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి అరవింద్ రెడ్డి, జిల్లా పౌరసఫరాల సంస్థ డి.ఎం. రాములు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వనపర్తి జిల్లాలో గంజాయి, గుట్కా, పేకాటపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి

Satyam NEWS

టీడీపీ అధినేత అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ కాగడాల ర్యాలీ

Satyam NEWS

ఓటింగ్ లో పాల్గొనాలి

Sub Editor

Leave a Comment