33.2 C
Hyderabad
May 14, 2024 12: 49 PM
Slider ఖమ్మం

దరఖాస్తులను పరిష్కరించాలి

#khammam

ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలపై సమర్పించిన దరఖాస్తులను అధికారులు త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు.  జిల్లా పరిషత్ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో అర్జీదారులను నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కొనిజర్ల మండలం లాలాపురంకు చెందిన కె. భద్రయ్య తాను ఉపాధిహామీ పథకం క్రింద పనిచేసేవాడినని, లాలాపురం గ్రామ పంచాయతీని వైరా మునిసిపాలిటీ లో విలీనం చేయడంతో తనను పనినుండి తీసేసారని, తాను వికలాంగుడినని, తనకు ఉపాధికల్పించమని దరఖాస్తు చేయగా, పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఉపాధికల్పనాధికారిని కలెక్టర్ ఆదేశించారు.

కామేపల్లి మండలం, ఊటుకూరు గ్రామం నుండి ఎన్. నాగమణి, తాను వితంతువునని, మంజూరయిన ఆసరా పెన్షన్ నిలుపుదల చేసారాని, తిరిగి ఇప్పించుటకు కోరగా, డిఆర్డీవో నీ విచారణ చేసి తగు చర్యలకై కలెక్టర్ ఆదేశించారు. కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామం నుండి రేగళ్ల రామారావు, తాను వికలాంగుడినని, ఆసరా పెన్షన్ మంజూరుకు కోరగా, డిఆర్డీవో కు చర్యలకై కలెక్టర్ ఆదేశించారు. తిరుమలాయపాలెం మండలం, గ్రామం నుండి పి. ప్రియాంక, అంగన్వాడీ ఆయా పోస్ట్ లో నియామకానికి కోరగా, పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.

ఖమ్మం రూరల్ మండలం గుదిమల్ల నుండి బి. వెంకటేశ్వర్లు, తనకు సర్వే నెం. 512ఆ లో ఎకరం పట్టా భూమి ఉండగా, బాబాయి కుమారులు దౌర్జన్యం చేసి ఆక్రమిస్తున్నారని, సహకరించుటకు కోరగా, రూరల్ తహసీల్దార్ కు విచారించి, తగు చర్య తీసుకోవాల్సినదిగా కలెక్టర్ ఆదేశించారు. నేలకొండపల్లి మండలం అనాసాగరం సిహెచ్. రాధ సర్వే నెం. 40/ఇ/1 లో 1.03 ఎకరాల భూమి మిస్సింగ్ సర్వే నెం. గా ఉన్నట్లు చర్యకై దరఖాస్తు సమర్పించగా, అట్టి దరఖాస్తును పరిశీలించి చర్యలు చేపట్టవలసినదిగా ధరణి సూపరింటెండెంట్ ను కలెక్టర్ ఆదేశించారు. కొనిజర్ల మండలం అంజనాపురం నుండి బెల్లంకొండ సూరమ్మ తాను పోడు భూమిలో వ్యవసాయం చేస్తున్నట్లు, విచారణ, సర్వే చేసి హక్కులు కల్పించుటకు కోరగా, జిల్లా అటవీ అధికారిని పరిశీలనకై కలెక్టర్ ఆదేశించారు.

కల్లూరు మండలం పేరువంచ గ్రామం నుండి శీలం పుష్పమ్మ 2వ వార్డులో తనకు గల ఇల్లు, వ్యవసాయ భూమి, చెట్లు, కాంపౌండ్ వాల్ గ్రీన్ ఫీల్డ్ రహదారి భూసేకరణ లో కోల్పోయానని, వ్యవసాయ భూమి, చెట్లు,  కాంపౌండ్ వాల్ కు మాత్రమే పరిహారం ఇచ్చారని, ఇంటికి పరిహారం మంజూరుకు కొరకై, తనిఖీ చేసి తగు చర్యలకై ఆర్డీవో ను కలెక్టర్ ఆదేశించారు. చింతకాని మండలం నాగులవంచ నుండి నాగలక్ష్మి, తన భర్త ప్రవీణ్ డిఆర్ఎఫ్ లో పనిచేస్తూ, విధుల్లో ప్రమాదవశాత్తూ మరణించారని, తమకు ఇల్లు లేనందున డబల్ బెడ్ రూం ఇల్లు మంజూరుకు కోరగా, తహసీల్దార్ కు చర్యలకై కలెక్టర్ ఆదేశించారు.

యూనిటీ ఆఫ్ మాల అసోసియేషన్ క్రొత్త కలెక్టరేట్ వద్ద డా. బీఆర్. అంబెడ్కర్ విగ్రహ ఏర్పాటుకు కోరగా, అదనపు కలెక్టర్, డిడి సాంఘీక సంక్షేమ శాఖ పరిశీలన చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. టీఎస్ఎఫ్ఐ బాధ్యులు తిరుమలాయపాలెం మండలం బచ్చొడుతాండ కు రెగ్యులర్ కార్యదర్శి నియమించాలని కోరగా, జిల్లా పంచాయతీ అధికారిని చర్యలకై కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related posts

డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న లైంగిక వేధింపులు

Satyam NEWS

అవతార పురుషుడు:కృష్ణావతారంలో యాదాద్రి లక్ష్మీనరసింహుడు

Satyam NEWS

నీట్, ఐఐటీ ఔత్సాహిక విద్యార్థులకు యల్ హెచ్ యల్ కంచన ఫౌండేషన్

Satyam NEWS

Leave a Comment