42.2 C
Hyderabad
April 26, 2024 16: 47 PM
Slider హైదరాబాద్

డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న లైంగిక వేధింపులు

#Digital World

డిజిటల్ ప్రపంచంలో మహిళలపైనా, పిల్లలపైనా లైంగిక వేధింపులు రోజు రోజుకూ పెరుగుతున్న మాట వాస్తవం. మరి ఈ అంశాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ఈ అంశాన్ని మనలో ఎవరైనా ఆలోచించారా? మనం కచ్చితంగా ఈ సమస్యను ఎదుర్కోవచ్చునని నిపుణులు అంటున్నారు.

ఈ లైంగిక వేధింపులను నిశ్శబ్దంగా భరించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఈ అంశంపై తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం, సింబయోసిస్ లా స్కూల్, హైదరాబాద్ వారి లీగల్ ఎయిడ్ సెంటర్ సంయుక్తంగా ఫేస్ బుక్ లైవ్ ఏర్పాటు చేశారు. నేటి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ ఈ ఫేస్ బుక్ లైవ్ ఉంటుంది.

ఇందులో ఐపిఎస్ అధికారిణి రీమా రాజేశ్వరి, ఐఎస్ఏసి రాజశేఖర మూర్తి, సైబర్ పీస్ ఫౌండేషన్ జానిస్ వర్ఘిస్ పాల్గొంటారు. సైబర్ స్పేస్ లో మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపులను ఎలా ఎదుర్కొనాలి అనే అంశంపై ఈ నిపుణులు మాట్లాడతారు.

ఆన్ లైన్ లో లైంగిక వేధింపులు జరకుండా నిరోధించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను వారు వివరిస్తారు. న్యాయపరమైన అంశాలను కూడా ఈ లైవ్ కార్యక్రమంలో నిపుణులు వివరిస్తారు.

(తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం నుంచి సత్యం న్యూస్ ప్రత్యేకం)

Related posts

ఈ నెలాఖరు వరకు ఏదైనా అత్యవసరమైతేనే బయటకురండి

Satyam NEWS

నేర్ధం బాలయ్య, భాస్కర్ గౌడ్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

గ్లోబరీనా..ఓ గ్లోబరీనా.. ఓహో గ్లోబరీనా

Satyam NEWS

Leave a Comment