28.7 C
Hyderabad
May 6, 2024 01: 02 AM
Slider నిజామాబాద్

పసికందును ఇంట్లో వదిలి.. రైతుల కోసం విధులకు

#nittujahnavi

మున్సిపల్ చైర్మన్ కు ప్రశంసల వెల్లువ

కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి.. ఇప్పుడు ఈ పేరు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోనే కాకుండా అంతటా వినపడుతోంది. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నా ఇష్టమైన చదువును వదిలి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ అరంగేట్రం చేసి అందరి ప్రశంసలు పొందారు. మంత్రి కేటీఆర్ సైతం ఆమెను రాజకీయాల్లోకి వచ్చినందుకు మెచ్చుకున్నారు.

కామారెడ్డి మున్సిపల్ చరిత్రలో అత్యధికంగా చదువుకున్న చైర్మన్ గా నిలిచారు. ఇటీవల జరిగిన మాస్టర్ ప్లాన్ వివాదంలో కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం ఉక్కిరిబిక్కిరి అయింది. రైతుల ఆందోళనతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో మిన్నకుండిపోయింది. చివరికి కౌన్సిల్ ప్రత్యేక సమావేశమై తీర్మానం ప్రవేశపెట్టింది. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒక్కటే.

కొత్తగా పెళ్ళైనా తన బాధ్యతను మర్చిపోకుండా అటు అత్తింటి బాధ్యతను నిర్వర్తిస్తూ ఇటు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమన్యాయం చేశారు ఛైర్మన్. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె సుమారు రెండు నెలల వరకు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉండదు. కానీ మాస్టర్ ప్లాన్ విషయంలో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చారు.

కేవలం 13 రోజుల బాలింత బయటకు రావాలంటే సాధారణంగా ఆడపిల్లకు చాలా ఇబ్బంది అవుతుంది. తన కష్టాన్ని, ఇబ్బందిని పక్కనపెట్టి రైతుల కోరిక మేరకు కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడానికి మీడియా ముందుకు వచ్చారు. గురువారం మీడియా ప్రతినిధులతో సమావేశమై రేపు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు.

శుక్రవారం తన బిడ్డను ఇంట్లో వదిలిపెట్టి మున్సిపల్ కార్యాలయానికి వచ్చి విధులు నిర్వర్తించారు. కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. తీర్మానం ప్రవేశపెట్టడంతో పాటు మీడియా అడిగిన ప్రశ్నలకు సుమారు రెండు గంటల పాటు నిలబడే ఓపికగా సమాధానమిచ్చారు. దాంతో మున్సిపల్ చైర్మన్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో బిడ్డను చూసుకోవాల్సి ఉండగా విధులకు హాజరవడం సాహసోపేత నిర్ణయమని కొనియాడుతున్నారు.

Related posts

విజయనగరం లో కార్డాన్ సెర్చ్…

Satyam NEWS

వచ్చే 5నెలలు కీలకం

Bhavani

మండిపడుతున్న గులాబి జెండా ఓనర్లు

Satyam NEWS

Leave a Comment