40.2 C
Hyderabad
May 6, 2024 18: 51 PM
Slider నల్గొండ

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు విఫలం

#rytusangham

రైతుల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక,మూడు  వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే సందర్భంలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, జనవరి 26న,జిల్లా కేంద్రంలో ట్రాక్టరు వాహనాల ర్యాలీని జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్,తెలంగాణ రాష్ట్ర  ఉపాధ్యక్షుడు కొప్పోజు సూర్యనారాయణ కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కరపత్రం విడుదల కార్యక్రమంలో కంబాల శ్రీనివాస్,కొప్పోజు సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చేస్తానని మోడీ ప్రకటించి అట్టి చట్టాలను అంతర్గతంగా అమలు చేస్తున్నాడని, అట్టి నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు తక్షణమే అమలు చేయాలని,రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని చేయాలని శ్రీనివాస్, సూర్యనారాయణ డిమాండ్ చేశారు.

విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని,లకింపూర్ కేరి జిల్లా లోని తికోనియా గ్రామంలో దేశ హోంశాఖ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుట్రతో వాహనాన్ని రైతుల పైకి తోలి నలుగురు రైతులు,ఒక జర్నలిస్టును మూకుమ్మడి హత్యలపై కేసు నమోదు చేయలేదని,ఈ హత్యలు ప్రభుత్వ హత్యలుగా ప్రకటించాలని అన్నారు.ఇప్పటికైనా దోషులను శిక్షించాలని,ఆ సందర్భంలో రైతులపై పెట్టిన కేసుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

50 సంవత్సరాలు నిండిన రైతులందరికీ 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని,అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కౌలు రైతులందరికీ ఋణ అర్హత కార్డులు ఇవ్వాలని కోరారు.జనవరి 26న,వాహన ర్యాలీని జయప్రదం చేయాలని  కోరారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పొనుగుపాటి వాసుదేవరావు, సోమగాని కృష్ణ,కుమ్మరి కుంట నాగేశ్వరరావు,మన్నెం గురుస్వామి,లింగం చిన్న కాశయ్య,వెంకటేశ్వర్లు,కుక్కడపు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

కేంద్రం నిధులకు బొమ్మా బొరుసు

Satyam NEWS

మిల్లర్లు అధికారులతో సమన్వయo చేసుకోవాలి

Bhavani

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక వారోత్సవాలు

Satyam NEWS

Leave a Comment