42.2 C
Hyderabad
May 3, 2024 15: 06 PM
Slider ముఖ్యంశాలు

వచ్చే 5నెలలు కీలకం

#Sajjanar,

రాబోయే ఐదు నెలలు ఆర్టీసీ సంస్థకు ఎంతో కీలకమని, పండుగల సీజన్ లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనర్ ఆదేశించారు.దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, మేడారం జాతరతో పాటు శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయని, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ధేశించారు.పండుగ సీజన్ సన్నద్ధత, క్షేత్రస్థాయిలో సిబ్బంది విధుల నిర్వహణ, తలెత్తుతున్న సమస్యలు, తదితర అంశాలపై హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఉద్యోగులందరితో శనివారం ఆయన వర్చ్‌వల్‌ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వంలో విలీనం చేయడంతో సిబ్బంది బాధ్యత మరింత పెరిగిందని, గతం కంటే రెట్టింపు స్థాయిలో పని చేయాలన్నారు.గత రెండేళ్లలో సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చామని, వినూత్న కార్యక్రమాలతో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింతగా చేరువ చేశామని తెలిపారు.

సంస్థ మనుగడ కోసం యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను అటు సిబ్బంది, ఇటు ప్రయాణికులు స్వాగతించారని పేర్కొన్నారు.వంద రోజుల ఛాలెంజ్‌, శ్రావణ మాసం ఛాలెంజ్‌, రాఖీ పండుగ ఛాలెంజ్‌, దసరా ఛాలెంజ్‌, సంక్రాతి ఛాలెంజ్‌, ఏడీపీసీ ఛాలెంజ్‌… ఇలా ఎన్నింటినో సిబ్బంది స‌వాలుగా స్వీక‌రించి లక్ష్యానికి మించి ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పని చేయడం వల్లే సంస్థకు సత్పలితాలు వచ్చాయని తెలిపారు.

Related posts

జర్నలిస్టు సురేష్ కు అల్లంనారాయణ సాయం

Satyam NEWS

ఆర్ఎస్ఎస్ కు అంతర్జాతీయ నిధులపై పాకిస్తాన్ ఆందోళన

Satyam NEWS

వినూత్నంగా మహిళా బంధు సంబురాలు

Sub Editor 2

Leave a Comment