23.2 C
Hyderabad
May 7, 2024 20: 31 PM
Slider విజయనగరం

ఆర్మీ రిక్రూట్మెంట్ లో తొలి రోజు 970 మంది..!

#recruitment

పీటీసీ లో రాత్రి 12 గంటలకు జిల్లా ఎస్పీ దీపికా పరిశీలన….!

కేంద్ర ప్రభుత్వ పథకమైన “అగ్ని వీర్…అగ్ని పథ్” పథకం లో భాగంగా ఆర్మీ చేపట్టిన ర్యాలీకి…ఏపీ రాష్ట్రంలో మొత్తం 13 జిల్లా ల కు…విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల ప్రాంగణం వేదిక అయింది. సరిగ్గా రాత్రి 12 30కు ఆర్మీ హెడ్ క్వార్టర్ నుంచే బార్ కోడ్ రావడంతో ర్యాలీ ప్రారంభమైంది. విజయనగరం జిల్లా కేంద్రంగా…అదీ పోలీసు బ్యారెక్స్ పక్కనే… పీటీసీ లో ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనండటంతో తొలి రోజు… ఈ ర్యాలీ కి పోలీసు బాస్ దీపికా… అర్ధరాత్రి 11 30 గంటలకు పీటీసీ కి వెళ్లి. ఆర్మీ అధికారులతో అసలు ర్యాలీ ఎలా ప్రారంభమవుతుంది… ఎంతమంది వస్తున్నారు..జిల్లా పరంగా కల్పించిన వసతులు వగైరా అంశాలపై మాట్లాడారు.

ఇక విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్ లో జూలై 20 నుండి ఆగస్టు 2 వరకు జరిగే అగ్నివీర్ ఆర్మీ నియామక ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎం.దీపిక, స్వయంగా పర్యవేక్షించారు. ఆర్మీ అధికారి జీఎస్ రంధవ నియామక ప్రక్రియను జిల్లా ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో భద్రత పర్యవేక్షణ నోడల్ అధికారి అయిన ఎఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, సీఐలు ఈ.నర్సింహ మూర్తి, విద్యాసాగర్, శోభన్ బాబు, కాంతారావు మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కెసిఆర్ పాలన లో మెరుగైన ప్రజా ఆరోగ్యం

Satyam NEWS

ఫైనల్ జస్టిస్: మృతదేహాలు పోస్టుమార్టంకు తరలింపు

Satyam NEWS

భార్యపై గొడ్డలితో  దాడి చేసిన భర్త

Satyam NEWS

Leave a Comment