28.7 C
Hyderabad
May 6, 2024 07: 59 AM
Slider జాతీయం

ఫైనల్ జస్టిస్: మృతదేహాలు పోస్టుమార్టంకు తరలింపు

nirbhaya 20

నిర్భయ కేసులో దోషులను ఊరి వేసిన అనంతరం సరిగ్గా 30 నిమిషాల పాటు ఉరి కొయ్యలకు వేలాడేలా అలానే ఉంచారు. జైలు వైద్యాధికారులు 30 నిమిషాల తర్వాత పరిశీలించి వారి శరీరాలలో ప్రాణం లేదని ఖరారు చేసిన తర్వాత ఉరి కొయ్యల నుంచి మృతదేహాలను కిందికి దించారు.

 సుమారు 6.05 నిమిషాలకు వారి మృత దేహాలకు తుది పరీక్ష పూర్తి అయింది. నిర్భయ అత్యాచారం హత్య కేసులో నలుగురు దోషులను ఢిల్లీలోని తిహార్ సెంట్రల్ జైలులో ఉరి తీసిన అనంతరం వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు.

నిర్భయ దోషులైన ముఖేశ్‌ సింగ్‌(32), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ ఠాకూర్‌ సింగ్‌(31), పవన్‌ గుప్తా(25)లను శుక్రవారం ఉదయం ఉరి తీసిన అరగంట తర్వాత వారి మృతదేహాలను ఉరికంబాల నుంచి కిందకు దించి వైద్యులు పరీక్షించారు. అనంతరం వారి మృతదేహాలను భారీ సాయుధ పోలీసుల బందోబస్తు మధ్య ఆసుపత్రికి తరలించారు.

శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టుమార్టం చేసి మృతదేహాలను వారి వారి కుటుంబసభ్యులకు అందజేశారు.

Related posts

పార్టీ లకు విరాళాల వెల్లువ

Bhavani

సీఎం నరసరావుపేట పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

ఉప్పెన షూటింగ్ లో విజయ్ సేతుపతి

Satyam NEWS

Leave a Comment