33.7 C
Hyderabad
April 29, 2024 00: 04 AM
Slider మహబూబ్ నగర్

కెసిఆర్ పాలన లో మెరుగైన ప్రజా ఆరోగ్యం

#kalwakurthy hospital

కెసిఆర్ పాలనలో ప్రజా ఆరోగ్యం మెరుగుపడిందని కల్వకుర్తి జడ్ పి టి సి భరత్ ప్రసాద్ అన్నారు.  వంగూరు మండలానికి చెందిన మహిళ  అర్ధరాత్రి రెండు గంటలకు పురిటి నొప్పులతో కల్వకుర్తి కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రికి  రాగా వారి బంధువులు వారికి  సమాచారం ఇచ్చారని, బుధవారం ఉదయం 6 గంటలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షితప్రసవాల రేటు పెరిగిందని, దీనికితోడు పుట్టిన బిడ్డలకు కెసిఆర్ కిట్టు అందజేయడం పై హర్షం వ్యక్తం చేశారు.

వైద్య ఖర్చుల కోసం మగ బిడ్డ అయితే 12000 ఆడబిడ్డ 13 వేల రూపాయలు ఇస్తున్నారని ఆయన  తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న డాక్టర్లు గొప్ప నైపుణ్యం కలిగిన వారని కెసిఆర్  ప్రభుత్వ పరిపాలనలో గొప్ప పనితీరు కనబరుస్తు పేద ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ మంచి వైద్యం అందిస్తున్న వైద్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్ని వార్డులు తిరిగి పేషంట్స్ తో మాట్లాడి దైర్యం చెప్పారు.

కరోనా మహమ్మారితో పోరాడుతూ ప్రజలకు వైద్యం అందించిన డాక్టర్లకు కృతఙ్ఞతలు తెలియజేసారు.

ఇటీవలే నాగర్ కర్నూలు జిల్లాకు మెడికల్ కాలేజీ ని మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

వరల్డ్ పోలియో డే సందర్భంగా విజయనగరం లో సైకిల్ ర్యాలీ

Satyam NEWS

‘బ్యాక్ డోర్’ గీతం ఆవిష్కరించిన రాజకీయ సంచలనం వైఎస్ షర్మిల

Satyam NEWS

ఏపీ డిప్యూటీ స్పీకర్.. రంజాన్ శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment