33.7 C
Hyderabad
April 29, 2024 02: 21 AM
Slider విజయనగరం

ప్రతిభ చూపిన విద్యార్ధులకు పోలీసుల సన్మానం

#students

ఎప్పుడూ చేతిలో లాఠీ.. నోటి వెంట పరుష పదాలు..ప్రతీ ఒక్కరినీ తప్పు చేసేవాడి దృష్టి తో చూసే ఖాకీలు ఉన్నారా…? అంటూ “నూటికో..కోటికో ఒక్కరూ…”అని పాడుకోవడమే కాదు.. అలానే ఉన్నారు… కాదు అలానే వ్యవహరించి..ఏకంగా శాఖకే పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చారు.. విజయనగరం వన్ టౌన్ పోలీసులు. వివరాల్లోకి వెళితే… ప్రభుత్వ బడిలో టెన్త్ చదివిన విద్యార్థుల ను ఓ ఖాకీ సన్మానించారు… కాదు.. ఓ పోలీసు అభినందించారు..

అక్కడి తో ఆగక ఏకంగా సన్మానించారు.విజయనగరం  కంటోన్మెంటు మున్సిపల్ హైస్కూల్లో 2023 విద్యా సంవత్సరంలో నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను విజయనగరం టౌన్  సీఐ డా. బి. వెంకటరావు అభినందించారు. మున్సిపల్ హైస్కూలులో టెన్త్ చదివిన విధ్యార్దులు (1) ఐ. లోకేష్ (587 ) (2) టి.ప్రశాంతి (582 ) (3) ఆర్. విష్ణు ప్రియ (565) సాధించారు. అంతేకాకుండా, వీరిలో ఇద్దరు విద్యార్ధులు నూజివీడు ఐఐఐటి లో సీటు సాధించడంతో, ముగ్గురు విద్యార్ధులను విజయనగరం వన్ టౌన్ సీఐ డా. బి.వెంకటరావు ఘనంగా సత్కరించి, అభినందించి, జ్ఞాపికలను అందజేశారు.

ఈ సందర్భంగా సీఐ  డా.బి. వెంకటరావు మాట్లాడుతూ – ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ టెన్త్ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబర్చి, అత్యధిక మార్కులు సాధించి, నూజివీడు ట్రిపుల్ ఐటిలో సీటు సంపాదించడం మామూలు విషయం కాదని  అన్నారు. ఇదే విధంగా చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఉన్నత శిఖరాలు చేరుకొని, తల్లిదండ్రుల ఆశలను నిజం చేయాలని, బాధ్యత కలిగిన వ్యక్తిగా సమాజంలో నడుచుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎం.కాంచన, వన్ టౌన్ సీఐ ఎస్ఐ భాస్కరరావు ఇతర ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు పాల్గోన్నారు.

Related posts

కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు బొమ్మగాని వెంకటయ్య(98) కన్నుమూశారు.

Bhavani

వేముల వాడలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

Satyam NEWS

ప్రారంభానికి ముందే తిప్పపూర్ ఆసుపత్రి వద్ద మంటలు

Satyam NEWS

Leave a Comment