37.7 C
Hyderabad
May 4, 2024 14: 40 PM
Slider ప్రత్యేకం

సాధికారత అంటూనే ద‌ళితుల ప‌ట్ల వివ‌క్ష‌: ఎంపీ కోమ‌టిరెడ్డి

#komatireddy

ద‌ళిత సాధికార‌త అంటూనే ద‌ళితుల ప‌ట్ల టీఆర్ఎస్ స‌ర్కార్ వివ‌క్ష చూపిస్తుంద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మండిప‌డ్డారు. నేడు తుర్క‌యాంజ‌ల్ మున్సిపాలిటీలో అవినీతి ప్ర‌శ్నించిన కాంగ్రెస్ కౌన్సిల‌ర్ల‌పై కేసులు పెట్ట‌డాన్ని నిర‌సిస్తూ అలాగే  ద‌ళిత మ‌హిళ కౌన్సిల‌ర్ ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన మున్సిప‌ల్  క‌మీష‌న‌ర్ ను అరెస్ట్ చేయాల‌ని స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, కాంగ్రెస్ నేత‌ల‌తో క‌లిసి నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ నేడు తుర్క‌యాంజ‌ల్ మున్సిపాలిటీకి చీకటిరోజుని తెలిపారు. ఏ అధికారైనా ప్ర‌జాప్ర‌తినిధులు అడిగిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని దూషించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సమ‌న్నారు. తుర్క‌యాంజ‌ల్ మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ చేసిన  అక్ర‌మాలు, అవినీతిని ప్ర‌శ్నించినందుకు కాంగ్రెస్ కౌన్సిల‌ర్ల‌పై కేసులు పెట్ట‌డం ఏంట‌నీ ప్ర‌శ్నించారు.

పైగా ద‌ళిత మ‌హిళ‌ కౌన్సిల‌ర్‌ను అసభ్యంగా దూషించడ‌మే కాకుండా అధికార పార్టీ నేత‌ల ఒత్తిడితో కేసులు పెట్ట‌డం అమాన‌వీయం అని మండిప‌డ్డారు.  ద‌ళిత మ‌హిళ కౌన్సిల‌ర్‌ను దూషించిన క‌మీష‌న‌ర్‌ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. వెంట‌నే కాంగ్రెస్ కౌన్సిల‌ర్ల మీద పెట్టిన కేసులు వెన‌క్కి తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. లేదంటే స‌ర్కార్‌పై పోరాటానికి సిద్ద‌మ‌వుతామ‌ని వెల్ల‌డించారు.

సీఎం ద‌ళిత సాధికార‌త అంటూనే ఇక్క‌డ ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల్లో ద‌ళితుల‌ను అవ‌మానిస్తున్నార‌ని విమ‌ర్శించారు. వ‌రంగ‌ల్‌లో మంత్రి ద‌యాక‌ర్ రావు మ‌హిళ అధికారిణి ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తే నేడు అధికారులు మ‌హిళ ప్ర‌జాప్ర‌తినిధులను అవ‌హేళ‌న చేయ‌డం ఏంట‌నీ ప్ర‌శ్నించారు. కేసీఆర్ ఇచ్చిన అలుసుతోనే ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు మ‌హిళ‌లు, ద‌ళితుల ప‌ట్ల వివక్ష చూపిస్తున్నారని విమ‌ర్శించారు.

టీఆర్ఎస్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతి అక్ర‌మాల‌కు పాల్పడుతుంద‌ని తెలిపారు. ఆ అవినీతిని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూభ‌య‌బ్రాంతులకు గురిచేస్తున్నార‌ని వివ‌రించారు. అలాంటి చ‌ర్య‌ల‌ను వివ‌ర‌మించుకోకుంటే త‌ప్ప‌కుండా టీఆర్ఎస్ స‌ర్కార్‌కు గ‌ట్టి గుణ‌పాఠం చెబుతామ‌ని తెలిపారు.

Related posts

అమెరికా దగ్గర భారీగా అణుబాంబులు తొలిసారి వెల్లడి

Sub Editor

మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతాం

Satyam NEWS

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

Satyam NEWS

Leave a Comment