37.2 C
Hyderabad
May 2, 2024 13: 02 PM
Slider వరంగల్

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

#journalistcolony

వెంకటాపూర్ జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని బీసీ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామ శివారులోని సర్వే నెంబర్ 14 ప్రభుత్వ భూమిలో జర్నలిస్టులు వేసుకున్న గుడిసెల వద్దకు ఆయన సోమవారం చేరుకొని జర్నలిస్టులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జర్నలిస్టులు నిరంతరం సేవ చేస్తున్నారని అన్నారు. అలాంటి జర్నలిస్టులు ఇంటి స్థలాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని అన్నారు.

ఈ క్రమంలోని జర్నలిస్టులు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవడం జరిగిందని అన్నారు. అధికారులు స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతోపాటు వారికి ఇండ్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. జర్నలిస్టుల న్యాయమైన కోరికను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ముదిరాజ్ సంఘం జిల్లా  కార్యదర్శి కొంతం రాజయ్య తోపాటు జర్నలిస్టులు భేతి సతీష్, పోశాల చంద్రమౌళి ,పిల్లల శివరాం, రంగశెట్టి రాజేందర్, ఒద్దుల మురళి, దండేపల్లి సారంగం, మామిడి శెట్టి ధర్మ తేజ ,మామిండ్ల సంపత్ ,ఎనగందుల శంకర్ ,భానోత్ యోగి ,ఎండి రఫీ ,ఎనబోతుల కృష్ణ, ఆకుల రామకృష్ణ ,దేశిని వినీల్ ,గట్టు ప్రశాంత్ ,తదితరులు పాల్గొన్నారు.

Related posts

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న పన్నాల

Satyam NEWS

ఆర్ధిక అక్షరాస్యత పై చైతన్యం

Bhavani

ప్రేమ కోసం : పాకిస్తాన్ వెళ్లి జైల్లో మగ్గి చివరికి హైదరాబాద్ చేరిన యువకుడు

Satyam NEWS

Leave a Comment