42.2 C
Hyderabad
May 3, 2024 15: 38 PM
Slider జాతీయం

షారుక్ కు మరోసారి నిరాశ.. కొడుకు ఆర్యన్ జైలులోనే

షారుక్‌ ఖాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ జైలు నుంచి కొడుకు ఆర్యన్ ఖాన్ రావడం వాయిదా పడింది. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ముంబై హైకోర్టు నుంచి బెయిల్ పొందిన ఆర్యన్ ఖాన్ ఈరోజు కూడా జైలు నుంచి విడుదల కావడం లేదు.  ఆర్యన్ విడుదల ఆర్డర్ కాపీ సరైన సమయంలో ఆర్థర్ రెడ్ జైలుకు చేరుకోలేదు.

బాలీవుడ్ స్టార్‌ షారూఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ మరో రోజు జైలులో ఉండాల్సి వస్తోంది. హైకోర్టు నుంచి వచ్చిన బెయిల్‌ డాక్యుమెంట్స్‌ ప్రాసెస్‌ పూర్తయినా.. అధికారుల సిగ్నేచర్‌ కాకపోవడం, విడుదలకు సమయం పూర్తికావడంతో రేపటికి వాయిదా పడింది. అయితే.. జైల్‌ నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు, కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది.

అంతకు ముందు జైలులో ఆర్యన్‌ను తండ్రి షారూఖ్‌ఖాన్‌, తల్లి గౌరీ ఖాన్‌లు కలుసుకున్నారు. లక్ష రూపాయల షూరిటీ బాండ్స్‌పై జుహీ చావ్లా సంతకం పెట్టింది. డ్రగ్స్‌ కేసులో 26 రోజులుగా జైల్‌లో ఉన్న ఆర్యన్‌కు నిన్న కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అంతకు ముందు.. సెషన్స్‌ కోర్టు రెండుసార్లు బెయిల్‌ కొట్టేయడంతో హైకోర్టును ఆర్యన్ ఖాన్ ఆశ్రయించారు.

Related posts

కరోనాతో కలుగులో దూరిన ఎమ్మెల్యేలూ ఎలా ఉన్నారు?

Satyam NEWS

జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి

Satyam NEWS

మల్లారెడ్డి ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు

Murali Krishna

Leave a Comment