33.2 C
Hyderabad
May 4, 2024 00: 25 AM
Slider సంపాదకీయం

కరోనాతో కలుగులో దూరిన ఎమ్మెల్యేలూ ఎలా ఉన్నారు?

#Corona Treatment

ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ఎమ్మెల్యేలు, ఎంపిలు, తెలంగాణలో 12 మంది ఎమ్మెల్యేలు మరి కొంత మంది ప్రజా ప్రతినిధులకు కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. వీరంతా హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. కొంత మంది వ్యాధి నయం అయి బయటకు కూడా వచ్చి ఉంటారు.

అయితే బయటకు వచ్చిన వారి గురించి కానీ, చికిత్స తీసుకుంటున్న వారి గురించి గానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా హెల్త్ బులిటెన్లు విడుదల చేయడం లేదు. పోనీ వారి గురించి తెలుసుకుని వార్త రాయాలంటే మీడియాకు అనేక ప్రతిబంధకాలు ఉన్నాయి. వీరంతా ప్రజా ప్రతినిధులు కావడంతో వీరి గురించి సంబంధిత నియోజకవర్గ ప్రజలకే కాకుండా అందరికి ఆసక్తి ఉంటుంది.

రెండు రాష్ట్రాలలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపిలు ఇప్పుడు కనిపించడం లేదు. కరోనా వచ్చిన వారు హైదరాబాద్ లోని ఖరీదైన ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతుంటే మరి కొందరు ఐసోలేషన్ పేరుతో ఎక్కడో ఉంటున్నారు. వారు ఎక్కడ ఉంటున్నారో తెలియని పరిస్థితే నెలకొని ఉంది.

హోం క్వారంటైన్ అంటే నియోజకవర్గంలోని హోం లో క్వారంటైన్ లో ఉన్నారా? హైదరాబాద్ వెళ్లిపోయారా? లేక మరేదైనా గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లిపోయారా అనే విషయం అర్ధం కాక ప్రజలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. రెండు రాష్ట్రాలలో కరోనా సోకిన 30 (సుమారు) మందే కాకుండా దాదాపు 100 నుంచి 150 మంది ప్రజాప్రతినిధులు ఎవరికి కనిపించకుండా పోయారు.

కరోనాతో సహజీవనం చేయాలని చెబుతున్న ముఖ్యమంత్రులు తమ తమ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కరోనాతో ఎలా సహజీవనం చేస్తున్నారో పబ్లిక్ కు చెబితే బాగుంటుంది. అంతే కాని వారిని రహస్యంగా దాచిపెట్టి ఉంచితే వారు కరోనాతో ఎలా సహజీవనం చేస్తున్నారో సాధారణ ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఆలోచించండి. ఆలోచించి వారి హెల్త్ బులిటెన్లు విడుదల చేయండి.

Related posts

సీఐకు అరెస్ట్ వారెంట్

Sub Editor 2

ఇంటర్ సిలబస్ తగ్గింపు పేరుతో చరిత్ర తొలగించడం తగదు

Satyam NEWS

కర్నూలులో జంట హత్యల ఘటన కలకలం

Satyam NEWS

Leave a Comment