సిద్దిపేట జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది.మానవత్వం మరిచి పోయి మహిళా అని చూడకుండా ఓ మహిళను స్థంబానికి కట్టేసి చెప్పులతో కొట్టారు సాటి మహిళలే తమ భర్తలతో ఆమెపై దాడి చేయించడం గమనార్హం. .పొలానికి వెళ్లే దారి విషయంలో వివాదం చెలరేగి జ్యోతి అనే మహిళను స్థంబానికి కట్టేసి చెప్పులతో కొట్టారు జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన హంస, జ్యోతి, స్వరూప, రమలు .వీరికి లష్మిపూర్ దగ్గర గల పోరెడ్డిపల్లి తండాలో వ్యవసాయ భూములు ఉన్నాయి.
తండాకు చెందిన గుగులోత్ జ్యోతికి, వీరికి మధ్య పొలానికి వెళ్లే విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జ్యోతి కి మరో నలుగురు మహిళలతో మాటామాటా పెరిగి, గొడవ జరిగింది.నలుగురూ తమ భర్తలకు ఈ విషయాన్ని చెప్పడం తో ఆగ్రహించిన వారు ఆ మహిళను లాక్కెళ్లి ఊర్లోని స్తంభానికి కట్టేశారు. చెప్పులతో కొట్టారు. బాధితురాలి కుంటుంబ సభ్యులు 100కి కాల్ చేయగా స్థానిక పోలీసులు వచ్చి జ్యోతిని విడిపించారు.