జగన్ రాజకీయ లబ్ది కోసం మూడు రాజధానుల అంశం తెరమీదకు తెచ్చాడని అందువల్ల ఇది తమకు సమ్మతం కాదని ఆంధ్రప్రదేశ్ బిజెపి స్పష్టం చేసేసింది. నేడు రాష్ట్ర బిజెపి కోర్ కమిటి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం పాత్రకేయుల సమావేశం లో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజధాని అమరావతిలోనే ఉండాలని బిజెపి తీర్మానం చేసిందని ఆయన తెలిపారు.
15వ తేది నుండి బిజెపి పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అమరావతి రాజధాని అని అసెంబ్లీ లో నిర్ణయం జరిగింది. అప్పడు వైకాపా అంగీకరించింది. ముఖ్య మంత్రి మారితే క్యాపెటల్ మారుస్తానంటే చూస్తూ ఊరుకోం అని బిజెపి విస్పష్టంగా తెచ్చింది. కొత్త రాజధాని నిర్మాణం జరగాలంటే నిధులు కేంద్రమే ఇవ్వాలి. జగన్ ఇష్టమొచ్చినట్లు చెయ్యడానికి వీలులేదు అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
ఇది ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి సమస్య అని ఆయన అన్నారు. శివరామకృష్ణ న్ కమిటి నివేదికను టిడిపి బుట్టదాఖలు చేసిందని ఆయన అన్నారు. టిడిపి, వైసిపి రాజకీయ భూ వ్యాపారం చేశారని ఆయన ఆరోపించారు. పరిపాలన వికేంద్రీకరణ కాకుండా, అభివృద్ది వికేంద్రీకరణ కు బిజెపి కట్టుబడి వుందని ఆయన తెలిపారు.
హైకోర్టు రాయలసీమలో ఉండాలని బిజెపి మ్యానిఫెస్టోలో పెట్టాం అందుకు తమకు అభ్యంతరం లేదని బిజెపి స్పష్టం చేసింది. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర సహ పరిశీలకుడు సునీల్ దియోదర్, పురందేశ్వరి, సోము వీర్రాజు, తురగా నాగభూషణం, అడపా శివనాగేద్రరావు తదితరులు పాల్గొన్నారు.