28.7 C
Hyderabad
May 6, 2024 10: 46 AM
Slider కడప

అంగన్వాడీల ద్వారా అమలుచేసే కార్యక్రమాలపై అవగాహన

#anganwadi

అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలుపరిచే కార్యక్రమాలపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ముడిమెల లక్ష్మీదేవి తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ స్పందన హలులో అన్నమయ్య జిల్లాలోని 8 ఐసీడీఎస్ ప్రాజెక్టు లలోని CDPO లు, సూపర్వైజర్ లు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో  సమీక్ష మరియు అవగాహన  సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ శాఖలోని పథకాలు వాటి లాభాలపై అవగాహన కల్పించారు. ప్రతి బాలింత, గర్భిణికి ,6సం. లోపు బాలలకు అందాలని సూచించారు. ఇందులో భాగంగా

1. బాల్య వివాహ నియంత్రణ లో అన్ని ( రెవెన్యూ, పోలీస్, పంచాయతీ ) శాఖ లను ఎలా సమన్వయం చేసుకోవాలి.

2. మహిళా పోలీస్ వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో బాలల పరిరక్షణ సమితలను ఏర్పాటు చేసి వాటి ద్వారా బాలల పరిరక్షణ పర్యవేక్షించాలి.

3. లైంగిక వేదింపులు నుండి బాలలను కాపాడుట కొరకు బాలలకు మహిళా పోలీస్ మరియు అంగన్వాడీ వర్కర్ ద్వారా మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి అవగాహాన కల్పించడం.

4. బాలల రక్షణ విషయంలో స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యులు కావాలని కోరారు.

ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి నిర్మల, ఐసీడీఎస్ ప్రాజెక్టుల సిడిపిఓలు, సూపర్వైజర్ లు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి బిఆర్ సుభాష్ యాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

విజ‌య‌న‌గ‌రంలో…ప‌ల్నాడు జిల్లా  క‌లెక్ట‌ర్ శివ శంక‌ర్…!

Satyam NEWS

పాఠశాల మౌలిక వసతులు ప్రారంభించిన అలీ

Bhavani

కోనసీమలో కరోనా కలకలం.. 24 విద్యార్థులకు పాజిటివ్..

Satyam NEWS

Leave a Comment