28.7 C
Hyderabad
May 6, 2024 09: 08 AM
Slider మహబూబ్ నగర్

సైబర్ నేరాలపై నాగర్ కర్నూల్ లో అవగాహన

#sheeteams

సైబర్ నేరాలపై నాగర్ కర్నూల్ SP కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాల్ లో live webinar కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ సూచనల మేరకు అడిషనల్ SP CH రమేశ్వర్ ఆధ్వర్యంలో షీ టీమ్ బృందం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలపై ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ట్విట్టర్, ఫేస్ బుక్, స్నాప్ షాట్, వాట్సాప్ లలో మనకు తెలియకుండా మన రహస్య సమాచారాన్ని ఎలా సేకరిస్తారో వివరించారు.

ఫోన్ హ్యాక్ చేసి ఈ విధంగా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా వేధించినట్లయితే వెంటనే ఏ రకమైన సహాయం పొందాలి అనే అంశాన్ని కూడా వివరించారు. అత్యవసర సమయంలో 1930,112,100 లేదా పోలీసు వారికీ సమాచారం ఇవ్వాలని సూచించారు. అనుమానిత వ్యక్తులకు ఓటిపి చెప్పొద్దనీ, ఫోటోస్ షేర్ చేయవద్దని, ఆడపిల్లలకు ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చానా, వేధించినా, ధైర్యంగా పోలీసులకు చెప్పాలని అన్నారు.

ముఖ్యంగా మనతో ఉన్నవారే మనకు తెలియకుండా ఫేక్ ఖాతాద్వారా అమ్మాయిలకు వేధిస్తున్నారు కాబట్టి అమ్మాయిలు ఫోన్ వాడేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ హార్జునయ్య, బ్యాంకు అధికారులు అంజయ్య, శ్రీనివాసులు, రాజు, అధ్యాపకులు కొందంఢ రాములు, సతీష్, రవితేజ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ షీ టీమ్ ఇంచార్జ్ విజయలక్ష్మి సభ్యులు వెంకటయ్య, వెంకటేష్ పాల్గొన్నారు.

Related posts

గ్రూప్‌-1 కటాఫ్ 75-85 మధ్యలోనే |

Satyam NEWS

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు ర్యాలీ

Satyam NEWS

సిరిమానోత్సవమా.. ? వైఎస్ఆర్సీపీ ఉత్సవమా..?

Satyam NEWS

Leave a Comment