29.7 C
Hyderabad
April 29, 2024 07: 44 AM
Slider ప్రపంచం

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా

#liztress

బ్రిటన్‌ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 44 రోజులు మాత్రమే ప్రధాని పదవిలో లిజ్ ట్రస్ కొనసాగారు. హోం మంత్రి సుయెల్లా బ్రవర్‌మన్ కూడా నిన్న రాజీనామా చేశారు. UK ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు లిజ్ ట్రస్ తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. గత కొద్ది రోజులుగా ఆమె ప్రతిపాదించిన ఆర్థిక కార్యక్రమం సభ ఆమోదం పొందలేదు. దీని వలన మార్కెట్లు పడిపోయాయి. అదే విధంగా కన్జర్వేటివ్ పార్టీ కూడా ఈ అంశంపై రెండుగా విడిపోయింది. రాజీనామా చేసిన అనంతరం లిజ్ ట్రస్ మాట్లాడుతూ, వారసుడిని ఎన్నుకునే వరకు తాను ప్రధానమంత్రిగా కొనసాగుతానని తెలిపారు.

Related posts

కమలానికి అటూ ఇటూ

Bhavani

జరుగుతున్న పరిణామాలతో దిగాజారుతున్న ప్రతిష్ట

Satyam NEWS

ప్రతిష్టాత్మకంగా బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం

Satyam NEWS

Leave a Comment