27.7 C
Hyderabad
May 4, 2024 08: 04 AM
Slider మహబూబ్ నగర్

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

#wanaparthy

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి చైతన్య పరచడమే ప్రధాన లక్ష్యమని వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ అన్నారు. గురువారం  వనపర్తి జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ పంక్షన్ హాలులో ” సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే ” కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా పోలీసు “షీ టీమ్స్” ఆద్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ షేక్ యాష్మీన్ భాష, పాల్గొని  జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థివిద్యార్ధులకు సైబర్ నేరాలు, మహిళ నేరాలగురించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్   మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గత పది నెలల నుండి ఆన్లైన్లో ” ఉమెన్ సెఫ్టీ వింగ్ తెలంగాణ పోలీసు మరియు స్కూల్ ఎడ్యూకేషన్ డిపార్టుమెంటు ” ఆద్వ ర్యంలో సైబర్ నేరాలపై జిల్లాలోని 50 పాఠశాలల నుండి , 50 మంది ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు10 నెలలు సైబర్ నేరాల తీసుకొనే జాగ్రత్తలగురించి  శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.

బహుమతులు అందచేసిన కలెక్టర్

27 జులై నుండి 31 జులై వరకు ఆన్లైన్ ద్వార పరీక్షలు  నిర్వహించి ప్రతిభ కనబరిచిన 10మంది విద్యార్థలను మరియు  ఉత్తమ ప్రతిభ కనబర్చిన మొదటి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసిన విద్యార్థులకు , గ్రాండ్ ఫినాలే రోజున వారికి బహుమతులు అందించారని తెలిపారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం, యంగిస్తాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ గ్రాండ్ ఫినాలే కర్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సైబర్ కాంగ్రెస్ పైనల్స్ విజేతలకు జిల్లా కలెక్టర్  బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ షాకిర్ హుస్సేన్  మాట్లాడుతూ సెల్‌ఫోన్లు, అంతర్జాలం, ఆన్‌లైన్ వేదికల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందని, ముఖ్యంగా మహిళలు, పిల్లలే లక్ష్యంగా సైబర్ మోసాలు, వేధింపులు అధికమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమానికి పోలీసుశాఖ, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్ చదువులు అనివార్యమయ్యాయని చదువు మాత్రమే కాదని, వైద్యం, అమ్మకాలు, కొనుగోళ్లు, ఉద్యోగాలు, లావాదేవీలు ఇలా అన్నీ ఆన్‌లైన్ వేదికగా కొనసాగుతున్నాయన్నారు. సెల్‌ఫోన్లు, అంతర్జాలం వినియోగం తప్పనిసరైంది.

ఇదే సమయంలో సైబర్ నేరాలు సైతం పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో తరగతులు వింటున్న విద్యార్థులు సైబర్ మోసాల బారిన పడకుండా… అంతర్జాలంతో పాటు మొబైల్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు సైబర్ కాంగ్రెస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ పోలీసు శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు, మహిళభద్రతా విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు.

సైబర్ కాంగ్రెస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలను నియంత్రించాలని… విద్యా వ్యవస్థలో ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పించాలని పోలీసు శాఖ భావిస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు, ఆడపిల్లలు, మహిళలు, యువతకు వీటిపై అవగాహన కల్పించనుందని,

సైబర్ కాంగ్రెస్‌లో నేర్చుకున్న విషయాల్ని అంబాసిడర్లు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి అవగాహన కల్పించాల్సి ఉంటుందని, ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మాత్రమే కాదు.. అందరికీ అవగాహన తప్పనిసరి అని ఆయన  అన్నారు.

సైబర్ అంబాసిడర్స్ గా ఎంపికైన విద్యార్థులు

1) టి సి, అక్షయ, మొదటి బహుమతి ఆత్మకూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల

2) డి, గీత -2వ బహుమతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆత్మకూరు

3) ఇ, చందు 3వ, బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మస్తీపూర్.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్  షేక్ యాష్మీన్ భాష, వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, జిల్లా విధ్యా శాఖాదికారి రవీందర్,GCDO, సుబ్బలక్ష్మి, జిల్లా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ (AHTU) ఎస్సై,అంజద్,జిల్లా “షీ టీం” ఎస్సై,స్వాతి, సైబర్ క్రైమ్ ఎస్సై, వేణు, ఎస్పీ పీఆర్వో,  రాజగౌడ్, షీ టిమ్స్ సిబ్బంది, శ్రీనివాసులు, క్రిష్ణ,వెంకటస్వామి, రమేష్, ఐటీ కోర్,సిబ్బంది, గోవింద్, రవీందర్ బాబు, విజయ్, జిల్లాలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

హరిహర క్షేత్ర మహాపడిపూజలో మంత్రి ఐకె రెడ్డి

Satyam NEWS

కాంట్రవర్సీ: ఇద్దరు ఐఏఎస్ అధికారులూ, ఒక జగను

Satyam NEWS

మూఢ నమ్మకం అయినా సరే వాస్తు గెలిచింది

Satyam NEWS

Leave a Comment