నిర్మల్ పట్టణంలోని హరిహర క్షేత్రంలో కొలువైన అయ్యప్పస్వామి మహా మండల పడిపూజలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గణపతి హోమం, అభిషేకం, పల్లకీ సేవలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు ,పూజారులు మంత్రి దంపతులకు తీర్థ ప్రసాదాలను అందజేసి, ఆశీర్వచనం చేశారు.
దేవదేవుడైన అయ్యప్ప స్వామి దీవెనలతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో TRS యువ నాయకులు అల్లోల గౌతంరెడ్డి దంపతులు, ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోద మురళీధర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, తంత్రి రాజన్ నంబూద్రి, ఆలయ గురుస్వామి మూర్తి, గురుస్వామి, తదితరులు పాల్గొన్నారు.