Slider వరంగల్

18 రోజుకు చేరిన వీఆర్ఏల రిలే నిరాహార దీక్ష

#mulugu

తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ములుగు జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాల ఆవరణలో వీఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్ష గురువారానికి 18 రోజుకు చేరుకుంది. రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ వారి దీక్షకు పూర్తీ గా సహాయ సహకారాలు అందిస్తాం అని మల్లంపల్లి మండల సాధన సమితి ప్రధాన కార్యదర్శి, జాయిన్ ఫర్ డెవలప్ మెంట్  అధ్యక్షుడు  కానుగంటి సతీష్ అన్నారు.

ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ సీఎం కెసిఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీని నెరవేర్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, తక్షణమే పే స్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేసారు. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా వారికి సహకరించాలని లేకుంటే వారి ఉసురు తాకి మట్టిలో కలుస్తారు అని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వీఆర్ఏ లజిల్లా అధ్యక్షుడు పాండవుల మహేందర్ కో కన్వీనర్ గుర్రం తిరుపతి రాజు ములుగు మండల అధ్యక్షుడు నన్నెబోయిన సురేష్ ఉపాధ్యక్షుడు సందీప్ ప్రధాన కార్యదర్శి పరికరాల మహేందర్ దాసు నరేష్ వినత రజిత సారయ్య గంజి స్వామి సాంబయ్య సంపత్ పద్మా లలిత మరియు ఇతర వీఆర్ఏలు పాల్గొన్నారు.

Related posts

బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు దరఖాస్తుకు నేడే తుదిగ‌డువు

Sub Editor

బాలీవుడ్ హీరోయిన్ ప్రేక్ష మెహతా ఆత్మహత్య

Satyam NEWS

హైదరాబాద్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి

Satyam NEWS

Leave a Comment