36.2 C
Hyderabad
May 14, 2024 15: 49 PM
Slider వరంగల్

కిషోర బాలికలకు నెలసరి పరిశుభ్రత పై అవగాహన సదస్సు

#anitareddy

నెలసరి బహిష్టు సమయంలో కిషోర బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హనుమకొండ లోని ఆనంద నిలయం బాలికల ఆశ్రమంలో పిల్లలకు అనురాగ్  హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ డా.కె.అనితారెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ  కిషోర బాలికలు బహిష్టు సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

ప్రతిరోజూ పౌష్టిక  ఆహారాన్ని తీసుకోవాలని, బహిష్టు సమయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని ఆమె కోరారు. ఇది మాటలాడకుండా ఉండే అంశం కాదని అనుమానాలు ఉంటే అడిగి తెలుసుకోవాలని అనితారెడ్డి కోరారు. బాలికలు  బహిష్టు సమయంలో  శుభ్రమైన  నాప్కిన్స్ ఉపయోగించి శారీరక శుభ్రతను పాటించాలని, అదే విధంగా ప్రతి నెల  మీ శారీరక స్థితి గురించి డాక్టర్ ని అడిగి తెలుసుకోవాలని ఆమె సూచించారు.

అలాగే  బాలికలు, ఏవైనా అరాచక శక్తులు  లేదా  మానసికంగా ఎవరి వల్లనైనా బాధపడుతుంటే  1098 లేదా 100 తెలియజేస్తే  న్యాయం చేస్తామని తెలిపారు. ప్రతి నెల ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ఉచిత మందులను అందిస్తున్నామని తెలిపారు. నెలసరి సమయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ఆప్యాయంగా పిల్లలను పలకరించారు.

ఏవైనా సమస్యలు ఉంటే తెలియ చేయమని అమ్మలా అడిగి వారు బహిష్టు సమయంలో తీసికొవాలసిన జాగ్రత్తలు పిల్లలకు సున్నితంగా అనితా రెడ్డి తెలియచేసారు. ఈ సమయంలో పిల్లలలు మానసికంగా ఇబ్బంది పడతారని వారికి ఎంతో అవగాహన అవసరం అని ఇది కిషోర బాలికలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం అని డాక్టర్ అనితా రెడ్డి తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సుజాత, కల్యాణి తదితర సిబ్బంది హజరయ్యారు.

Related posts

మాఫియా: ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న పోలీసులు

Satyam NEWS

టీడీపీ ఎంపీ రామ‌మోహ‌న్‌నాయుడు సంస‌ద్‌ర‌త్న

Satyam NEWS

మంత్రి కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం

Satyam NEWS

Leave a Comment