Slider తెలంగాణ

కాంట్రవర్సీ నేచర్: తీరు మారని బైంసా నిత్యం ఘర్షణలే

bainsa attack

భైంసా పట్టణంలో ఇరువర్గాల తీరు మారడం లేదు.అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన ఇరువర్గాలు ఏకారణం లేకుండానే కయ్యానికి కాలు దువ్వుకుంటున్నాయి, తెలంగాణ రాష్ట్రము లో ఎక్కడ లేని విధంగా ఒక్క భైంసా లోనే ఏడాదికి రెండు మూడుసార్లు మత ఘర్షణలు చోటుచేసుకోవడం పై ప్రభుత్వం దృష్టిపెట్టింది.భైంసా లో అల్పసంఖ్యాకులుగా పిలువా బడే వారి జనాభా ఎక్కువగా ఉండటం తో ఆధిపత్యం కోసమే ఈ ఘర్షణలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాజధాని హైదరాబాద్ లోనే ఈ ఘర్షణలకు ఎన్టీఆర్ హయం లో తెరపడగా ఆదివా రం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పట్టణంలోని కోర్వాగల్లి ప్రాంతంలో ఆదివారం రాత్రి ఒక వర్గానికి చెందిన వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా, మరో వర్గానికి చెందిన వ్యక్తితో స్వల్ప వాగ్వా దం జరిగింది. ఇది కాస్తా పెద్ద ఎత్తున ఇరు వర్గాల మధ్యన ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణతో ఒక్కసారిగా పట్టణంలో భయానక వాతావరణం నెలకొంది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లదాడికి పాల్పడ్డారు.దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు, పలువురు స్థానికులకు గాయాలయ్యాయి.

సీఐ శ్రీనివాస్‌ తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న ఎస్పీ శశిధర్‌రాజు హుటా హుటిన భైంసా చేరుకున్నారు. ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో సంఘటనా స్థలంలోనే ఉండి జిల్లా ఎస్పీ, డీఎస్పీలు పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘర్షణలో రెండు బైకులు ధ్వంసం కాగా మరో 10 బైకులు, రెండు ఇళ్లు కూడా దగ్ధమైనట్టు తెలిసింది. భైంసాలో అల్లర్లు జరిగిన ప్రాంతంలో కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ శశిధర్ రాజు పర్యటించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ ప్రజలను కోరారు.ఏది ఏమైనా అన్నదమ్ముల్లా మిగతా ప్రాంతాల్లో కలిసి ఉంటున్న ఒక్క భైంసా లోనే ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకుని ప్రభుత్వం గొడవలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనిఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

Related posts

మేం సేకరించే సమాచారం ఎక్కడికి వెళుతున్నది?

mamatha

అకాల వర్ష బాధితులకు తక్షణ సాయం

Satyam NEWS

ఆసియా కప్ టైటిల్ గెలుచుకున్న శ్రీలంక

Satyam NEWS

Leave a Comment